అన‌తి కాలంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ నిర్మాత‌గా ఎదిగిపోయ‌డు బండ్ల గ‌ణేష్‌. నిర్మాత‌గా త‌ను సేఫ్‌లో ఉంటూనే.. త‌న టీమ్‌ని అన్నివిధాల సంతృప్తిప‌రుస్తాడు... అనే పేరుంది. అత‌నితో ఒక్క‌సారి సినిమా చేస్తే... మ‌ళ్లీ మ‌ళ్లీ చేయాల‌నిపిస్తుంద‌ట‌. దానికి బ‌న్నీనే ఉదాహ‌ర‌ణ‌.

అంత‌కు ముందు బండ్ల గ‌ణేష్‌... బ‌న్నీతో సినిమా తీయాల‌ని చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నించాడ‌ట‌. ఎన్నో రిక‌మెండేష‌న్లు చేయించాడ‌ట‌. 'అమ్మో.. గ‌ణేష్‌తో సినిమా చేయ‌లేను' అని బ‌న్నీ పారిపోయేవాడ‌ట‌. కానీ ఇద్ద‌ర‌మ్మాయిల‌తో చేశాక‌.. గ‌ణేష్ తో మ‌ళ్లీ మ‌ళ్లీ చేయాల‌ని పిస్తోంద‌ట‌. ఈ సినిమా ఫ‌లితంతో సంబంధం లేకుండా - నీకు మ‌రో సినిమా చేసి పెడ‌తా.. అని గ‌ణేష్‌కి మాటిచ్చాడ‌ట బ‌న్నీ. మ‌రి గ‌ణేష్‌లో అంత మెప్పించే గుణం ఏముందో..?  దేనితో బన్నీని టెప్ట్ చేశాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: