ఇటీవల కాలంలో ఏ తెలుగు సినిమాలోనూ కనిపించని క్యాస్ట్ ఫీలింగ్ తాజాగా విడుదలైన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాలో కనిపించింది. సామాజిక సృహ ఉండే అంశాలను తన సినిమాల్లో ప్రస్తావించడం పూరీ జగన్నాథ్ కు ముందుంచే ఉన్న అలవాటై అయినా ఈ సినిమాలో అదీ చాలా శృతిమించినట్లు కనిపిస్తుంది. అసలు ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ను పూరీనే రాసాడానా... అనుమానం కలుగుతుంది. ఎంతిటి క్లిష్టమైన సమస్యనైనా, ఎంతటి నొప్పించే అంశమైనా... పదునైన మాటలతో.. వ్యంగ్యంగా చెప్పడం పూరీ జగన్నాథ్ శైలీ. ఇలాంటి ప్రతిభ ఉన్నది కాబట్టే తన సినిమాలకు తనే మాటలను రాసుకుంటాడు. కానీ, ఈ సినిమాలో అది కాస్త గాడితప్పింది.

హీరో హీరోయిన్ల పెళ్లి మాటల సందర్భంలోనూ, హీరో - హీరోయిన్లు మధ్య ప్రేమ సన్నివేశంలోనూ ‘కులాల’ గోల ఎక్కువయ్యింది. బ్రహ్మణులు, రెడ్డి, కాపు కులాలను ఈ సినిమాలో ఎక్కువగా ప్రస్తావించారు. బ్రహ్మణులు కించపరిచేవిధంగా హీరో మేము ‘బాపనీస్’ అనే పదాన్ని వాడతాడు. కులాంతర వివాహలు తప్పుకాదు అనే ఉద్దేశ్యంతో కాపు  అబ్బాయి కి రెడ్డి అమ్మాయి తో పెళ్లి అయిందని, రెడ్డి అబ్బాయి కాపుల అబ్బాయి అని పెళ్లి చేసుకుని సుఖంగా ఉందనే మాటలు వినిపిస్తాయి.

అలాగే, స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకున్న ప్రభావమో లేక, రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా ఆకర్షించే ఉద్దేశ్యయో తెలియదు కానీ... సినిమా లో చాలా సన్నివేశాల్లో అల్లు అర్జున్ ‘రెడ్డి గారూ..’ అని పిలిపించుకుంటాడు.

మొత్తానికి ఇటీవల కాలంలో ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమాలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువయ్యిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: