తెర‌పై క‌థానాయిక‌ బ‌బ్లీగా క‌నిపిస్తే చాలు.. అనుకొనే వారికి ఓ చ‌క్క‌ని ఆప్ష‌న్ హ‌న్సిక‌. సిమ్లా యాపిల్ లాంటి బుగ్గ‌ల‌తో ఊరిస్తుంటుంది. ఏ హీరో ప‌క్క‌న అయినా ఈజీగా సెట్ అయిపోతుంది. హ‌న్సిక అంత‌గ‌త్తె మాత్ర‌మే కాదు, మంచి న‌టి కూడా అని కితాబిస్తున్నాడు ద‌ర్శ‌కుడు హ‌రి.

ఆయ‌న సింగం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. య‌ముడు సినిమాకి సీక్వెల్ ఇది. తొలి భాగంలో హ‌న్సిక లేదు. ``కొన్ని పాత్ర‌లు సీక్వెల్ కోసం జోడించాం. అందులో.... హ‌న్సిక పాత్ర త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. త‌ను చాలా మంచి ఆర్టిస్ట్‌. ఎలాంటి స‌న్నివేశం అయినా ఒక్క టేక్‌లోనే చేసేస్తుంది.

పాత్ర‌లోని త్వ‌ర‌గా వెళ్లిపోతుంది. సంభాష‌ణ‌లు చాలా త్వ‌ర‌గా అర్థం చేసుకొంటుంది. హన్సిక‌తో ఇంత‌కు ముందు ప‌నిచేయలేదు. ఇప్పుడు మ‌ళ్లీ మ‌ళ్లీ చేయాల‌నిపిస్తోంది...`` అని చెబుతున్నాడు హ‌రి. నిజంగా హ‌న్సిక‌కు ఇది గ్రేట్ కాంప్లిమెంటే.

మరింత సమాచారం తెలుసుకోండి: