పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమి చేసినా అది సంచలనమే. గతంలో హీరోగా మంచి క్రేజ్ లో ఉన్నప్పుడు “జానీ” సినిమాకు దర్శకత్వం వహించాడు. “తిన్ మార్” సినిమాలో ఫైట్స్ కంపోస్ చేశాడు పవన్. గతంలో తను నటించిన “తమ్ముడు”, “ఖుషి”, “జానీ” సినిమాలతో పాటు రాబోతున్న “అత్తారింటికి దారేది” సినిమాలో పవన్ తన గాత్రాన్ని తన అభిమానుల కోసం రుచి చూపించాడు. ఇలా సకల కళా ప్రవీనుడిగా పేరుగాంచిన పవర్ స్టార్ కు సినిమా రంగంలో తెలియని విభాగం లేదు. కెమెరా యాంగిల్స్ దగ్గర నుంచి హీరోయిన్ హెయిర్ స్టైల్ వరకూ ప్రతి విషయం మీద పవన్ కు స్పష్టమైన అవగాహన ఉంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ తో “అత్తారింటికి దారేది” సినిమా దాని తరువాత సంపత్ నంది తో “గబ్బర్ సింగ్-2” సినిమాలలో నటిస్తున్న పవన్, ఒక సినిమాకు తానే స్వయంగా స్క్రీన్ ప్లే రాస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా పేరు “కోబలి” అని అంటున్నారు. వెరైటీ గా ఉన్న ఈ టైటిల్ పవన్ ఆలోచనలు నుంచి వచ్చిందని అంటున్నారు. ఈ టైటిల్ పేరు చాలా బాగుందని దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఓటు వేశారట. అంతేకాదు అన్ని కుదిరితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని టాక్. ప్రస్తుతం “గబ్బర్ సింగ్-2” స్క్రీన్ ప్లే విషయంలో కూడా దర్శకుడు సంపత్ నంది తో కలిసి పవన్ చేయి కలుపుతున్నాడు అని టాక్.

ఇలా సినిమా కధా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా పవన్ చేయబోతున్న ప్రయోగాలను త్వరలో మెగా అభిమానులు చూడబోతున్నారు. కాని గతంలో దర్శకత్వం వహించి ఘోరంగా చేతులు కాల్చుకున్న పవన్, ఇంత పోటీ వాతవరణంలో రచయితగా మారి కాలం పట్టవలసిన అవసరం ఉందా..? అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రయోగాలు వికటిస్తే అవి హీరోల కెరియర్ విషయంలో తీవ్రప్రభావాన్ని చుపెడతాయన్న విషయం పవన్ కు తెలియనిది కాదు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: