మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో ఈమధ్యనే విడుదల అయిన “ప్రేమ కధా చిత్రమ్” సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు ఖచ్చితంగా 10 కోట్ల పైగానే వసూళ్ళు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఈమధ్య ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది.

ఈ సక్సెస్ మీట్ లో మారుతి మాత్రం చాలా ఆవేశంగా పుల్ స్టాప్ లు, కామాలు లేకుండా పెద్ద ఉపన్యాసం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరచాడు. అంతేకాదు తన సినిమాల గురించి తనకు తానే ఎత్తేసుకుంటూ, ద్వందార్ధాలు ఉన్నంత మాత్రాన ప్రతీ సినిమా సూపర్ హిట్ కాదని, ఆ సినిమా కధనంలో బలం ఉంటేనే సినిమా ఆడుతుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన సినిమాలలో కేవలం యూత్ ని ఆకర్షించడానికి మాత్రమే ఇటువంటి చిన్న చిన్న ద్వందార్ధాల డైలాగ్స్ పెడతానని, సినిమా విలువని తగ్గించడానికి మాత్రం కాదు అంటూ భారీ డైలాగ్స్ వాడాడు. ఇకపై ఇటువంటి డైలాగ్స్ లేకుండ తన సినిమాలు ఉంటాయని కూడా చెప్పుకొచ్చాడు మారుతి.

కాని మారుతి ఆవేశాన్ని విశ్లేషిస్తే, ఒక ఆశక్తికర విషయం బయటకు వచ్చింది. ఈమధ్య జరిగిన ఒక చిన్న సినిమా ఆడియో వేడుకలో దాసరి మాట్లాడుతూ, తనకు చిన్న సినిమాలను ప్రోత్సహించాలని ఉన్నా, ఆ సినిమాలలో రాజ్యం ఏలుతున్న బూతు డైలాగ్స్ చూస్తే భయం వేస్తుందని, ఒక ఝలక్ విసిరారు. దీనికి కౌంటర్ గా మారుతి ఇంత ఆవేశపూరిత ఉపన్యాసం ఇచ్చాడా..? లేకుంటే నిజంగానే మారుతి మారిపోయాడా..? అనే విషయాలు తెలియాలి అంటే అల్లు శిరీష్ హీరోగా మారుతి తీస్తున్న “కొత్తజంట” వచ్చే వరకూ ఆగాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: