హీరో సిద్ధార్థ్ కు ఒక జోనర్ ఆడియన్సులో మంచి పేరుంది. ఆ జోనరుని ప్రక్కన పెట్టి ప్రయోగాలూ అంటూ గత కొంత కాలంగా సిద్ధార్థ్  చేతులు కాల్చుకుంటున్న విషయం తెలిసిందే. తన స్థితి, గతులని మరిచి సిద్ధార్థ్ వెళుతున్న వేలో అతనికి గట్టిగానే ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే ఎండి పోతున్న చేనుపై వర్షం పడినట్లుగా, కెరియర్ చివరి దశకు వచ్చేసింది అనే టైంకి సిద్ధార్థకు 'సంథింగ్ సంథింగ్' మళ్లీ ఆశను చిగురించింది. 
 

అయితే సిద్ధార్థ్ కంటే ఎక్కువుగా బ్రహ్మానందంకు పేరు వచ్చినా, హీరో సిద్ధార్థయే కాబట్టి కాస్తో, కూస్తో అతనికి కూడా ఈ విజయంలో పాలుదక్కుతుంది. అంతెందుకు ఈ చిత్ర విజయం గురించి సక్సెస్ మీటులో మాట్లాడిన నిర్మాత సుబ్రహ్మణ్యం కూడా, బ్రహ్మీకే హిట్ క్రెడిట్ ఇస్తున్నాడు తప్ప సిద్ధార్థకి  హిట్టుని ఆపాదించడం లేదు. 
 

సిద్ధార్థ్ పేరూ చెప్పాడు. ఎలా అంటే సిద్ధార్థకి కూడా ఈ మూవీ ఎంతో హెల్ప్ అయింది అని. అంటే  అర్థం ఏమిటి? అతనికే ఈ మూవీ హిట్ ఇచింది తప్ప, అతని వల్ల ఈ మూవీకి ఒరిగినదెం లేదనే కదా! అదన్నమాట ప్రస్తుతం సిద్ధార్థ్ పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: