ఈనెల 11న చిరంజీవి మెగా మూవీ ఖైదీ నెంబర్ 150 విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో మాంచి హైప్ క్రియేట్ చేస్తోంది. చిరంజీవి దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ మేకప్ వేసుకున్న చిత్రం కావడంతో అభిమానుల్లో విపరీతమైన ఎక్సయిటింగ్ ఉంది. ఇప్పుడు ఈ సినిమా పాటల రికార్డులు కూడా వారికి మరింత ఉత్తేజాన్నిస్తున్నాయి. 



తాజాగా ఈ చిత్రంలో ‘అమ్మడు..’ పాట యూట్యూబ్ ను హోరెత్తిస్తుందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ పాటను డిసెంబరు 18న యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇప్పటికే ఈ పాటను చూసిన వారి సంఖ్య కోటి దాటేసింది. దాదాపు 89 వేల మంది ఈ పాటను లైక్ చేశారు. మరో 12 వేల మంది అన్ లైక్ చేశారు. 


ఈ పాట కోటి వ్యూస్ సాధించిన సందర్భంగా.. చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ట్విట్టర్‌ ద్వారా తన సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. Thank U so much everyone 4 d Awesome Tremendous Love 4 "AMMADU lets do KUMMUDU" !! 1 CRORE VIEWS !! Wooohoo!! Lov U all.. అంటూ ట్వీట్ చేశారు. 



మరోవైపు ఈ సినిమా ట్రైలర్ కూడా యూ ట్యూబ్ ను ఊపేస్తోంది. విడుదల చేసిన తొలిరోజులోనే దాదాపు 30 లక్షల వ్యూస్ కొల్లగొట్టింది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై చిరు కుమారుడు  రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని వివి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 11న  ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: