బాలీవుడ్ లో కండలవీరుడుగా గుర్తింపు తెచ్చుకున్న హీరో సల్మాన్ ఖాన్.  గత సంవత్సరం సల్మాన్ నటించిన ‘సుల్తాన్’ లాంటి సినిమాతో రికార్డుల మోత మోగించారు.  ఇక ‘బాహుబ‌లి ది బిగినింగ్’ సృష్టించిన బాక్సాఫీసు రికార్డులు ప్రాంతీయ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళిని ఒక్క రాత్రిలో జాతీయ స్థాయి ద‌ర్శ‌కుడిగా మార్చేశాయి. తెలుగు సినిమా స‌రిహ‌ద్దులను చెరిపివేసి దేశ‌విదేశాల్లో భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లోనే రెండో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు (600కోట్లు) సాధించిపెట్టింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఎంతో మంది అగ్ర హీరోలు తెగ ఉత్సాహ పడుతున్నారు. ప్రస్తుతం ‘బాహుబ‌లి’ రెండో భాగం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
Related image
 ‘బాహుబ‌లి’ని ఎందుకు చంపాడు అనే సంచ‌ల‌నాత్మ‌క ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌నున్న ‘బాహుబ‌లి-2’కి జ‌రుగుతున్న ప్ర‌చారం ఆకాశాన్నంటిందంటే అతిశ‌యోక్తి లేదు.  అంతే కాదు ప్రాంతియ ప‌రిధిలో కాకుండా భారీ స్థాయి ఆడియ‌న్స్‌ని ఆక‌ర్షించాల‌ని రాజ‌మౌళి బ‌లంగా  కోరుకుంటున్నాడ‌ని, ప్ర‌స్తుతం ‘బాహుబ‌లి2’ షూటింగ్ పార్ట్ ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నందున‌, అతి త్వ‌ర‌లోనే రాజ‌మౌళి నేరుగా హిందీలోనే సినిమా తీసే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలిపారు.
Image result for baahubali 2
ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోగా చెలామణి అవుతున్న సల్మాన్ ఖాన్ తో సినిమా అంటే కలెక్షన్ల వర్షం కూరుస్తుందని నమ్మకం దర్శక, నిర్మాతలకు ఉంది.  ఈ నేపథ్యంలో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో సల్మాన్ తో ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందనే చర్చలు మొదలయ్యాయి.  . వీరిద్ద‌రు క‌లిస్తే ప్ర‌స్తుతం దేశంలో స‌మాదైన బాక్సాఫీసు రికార్డుల‌ను ఆ సినిమా తుడిచిపెట్టేస్తుంద‌ని చిత్ర‌రంగ ప‌రిశీల‌కుల అంచ‌నా. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి తత‌దుప‌రి చిత్రం తెలుగులోనా లేక హిందీలోనా అనేది త్వ‌ర‌లో తెలియ‌వ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: