తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్న హీరో కమల్ హాసన్.  ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన కమల్ హాసన్ అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.  తాజాగా తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.  తమిళనాడులో సాంప్రదాయంగా వస్తోన్న జల్లికట్టు క్రీడకు మద్దతు పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ క్రీడకు సంబంధించి ఏకంగా ప్రత్యేక చట్టం చేయాలంటూ కేంద్రానికి తమిళనాడు ప్రభుత్వం విన్నపంచేసిన సంగతి తెలిసిందే.
Image result for alanganallur jallikattu 2013
సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న ఈ ఆటను నిషేధించటం సరికాదన్న అభిప్రాయాన్ని కమల్ వ్యక్తం చేశాడు. చెన్నైలో జరుగుతున్న సౌత్ క్లోన్ క్లేవ్ కు హాజరరైన కమల్ ఒకవేళ జల్లికట్టుపై నిషేధం విధిస్తే.. అదే సమయంలో బిర్యానీ పై కూడా బ్యాన్ వేయాలని అంటున్నాడు. ఎద్దులను హింసించేది అని ఫీలవుతున్న జంతు ప్రేమికులకు, బిర్యానీ కోసం మూగజీవాలను చంపడం పాపంగా కనిపించటం లేదా? అని ప్రశ్నించాడు.
Image result for alanganallur jallikattu 2013
స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ కు, తమిళనాడులోని జల్లికట్టుకు ఎంతో తేడా ఉందని చెప్పారు. బుల్ ఫైట్ లో ఎద్దులు హింసకు గురవుతాయని ఒక్కోసారి చనిపోతాయని తెలిపారు. కానీ, జల్లికట్టులో ఎలాంటి హింస ఉండదని... తమిళనాడులో ఎద్దులను దేవుడిలా పూజిస్తారని చెప్పారు. జల్లికట్టుకు తాను వీరాభిమానినని తెలిపిన కమల్ తాను చాలాసార్లు ఆ క్రీడలో పాల్గొన్నట్లు తెలిపాడు.జల్లికట్టు క్రీడ జంతుహింసకిందకు వస్తుందనుకుంటే, బిర్యానీకూడా బ్యాన్ చేయాలని కమల్ కామెంట్ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: