తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి గత రెండు సంవత్సరాల నుంచి గోల్డెన్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి.  పూరి దర్శకత్వంలో ‘టెంపర్’ చిత్రంతో మొదటు పెట్టిన జైత్రయాత్ర ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో కొనసాగింది.  హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న ఎన్టీఆర్ తన కెరీర్ లో కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు సృష్టించారు.  
Image result for janatha garage
తాజాగా ఎన్టీఆర్ ఖాతాలో మరో రికార్డు చేరింది..ఇంతకీ ఎన్టీఆర్ అందుకున్న సరికొత్త రికార్డ్ ఏంటో తెలుసా.. 2016 సంవత్సరంలో టివి లో అత్యధిక ప్రేక్షకులు చూసిన ఎన్టీఆర్, మోహన్ లాల్ నటించిన జనతా గ్యారేజ్ కావడం విశేషం. ఈ విషయాన్నీ టివి ఆడియన్స్ మానిటరింగ్ ఏజెన్సీ ( బి ఏ ఆర్ సి ) ప్రకటించింది .

ఎన్టీఆర్ సరసన సమంత , నిత్యా మీనన్ లు నటించగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: