తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు తెచ్చుకొని తెలుగు వారి గుండెల్లో అభిమానం సంపాదించిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  దాదాపు 9 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ తెరపై కనిపిస్తున్నారు.  తమిళంలో సూపర్ హిట్ సినిమా అయిన ‘కత్తి’ రిమేక్ గా తెలుగులో ‘ఖైదీ నెంబర్ 150’ తెరకెక్కించారు.  అయితే చిరంజీవి నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గా చిరు తనయుడు రాంచరణ్ నటించిన ‘ధృవ’ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలు వేసుకున్నారు.
Image result for khaidi no 150 posters
ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘ఖైదీ నెంబర్ 150’ రిలీజ్ అయ్యింది. ఇక ఓవర్ సీస్ లో అయితే అప్పుడే చిరు మేనియా తో దద్దరిల్లి పోతోంది . ప్రీమియర్ షోలకు బీభత్సంగా కలెక్షన్లు వస్తున్నాయి . కేవలం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్లను వసూల్ చేసేలా ఉంది ఖైదీ నెంబర్ 150 చిత్రం .  యు ఎస్ , యూకే , యు ఏ ఈ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా కలెక్షన్ల కనక వర్షం కురుస్తోంది .
Image result for khaidi no 150 posters
ఇంకా పండగ మూడు రోజులు ఉండగానే వసూళ్లు ఈ రేంజ్ లో ఉంటే వారం రోజుల తర్వాత లెక్కలు కడితే బాక్స్ లు బద్దలు కావలసిందే అన్న జోష్ లో ఉన్నారు మెగా ఫ్యాన్స్ . బాస్ సినిమా చాలాకాలం తర్వాత రిలీజ్ అవుతోంది అన్న ఉత్సాహంలో ఉన్నారు. మాస్, క్లాస్, కామెడీతో పాటు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ తో చిరంజీవి రెండు పాత్రల్లో దుమ్మురేపారని అంటున్నారు. మొత్తానికి చిరు రీ ఎంట్రీ పెద్ద సంచలనమే సృష్టిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: