మెగాస్టార్ అభిమానులు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఖైదీనెం 150 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రైతు సమస్యల కథాంశంతో వచ్చిన ఈ చిత్రం 
ఒక మంచి సమస్యను ఆవిష్కరించిందన్న టాక్ వినిపిస్తోంది. అందులోనూ తమిళంలో విజయవంతమైన కథ కాబట్టి సినిమా ఫలితంపై పెద్దగా అనుమానాల్లేవు. 



కాకపోతే సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందన్నదే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అంశం. అందులోనూ పోటీగా బాలయ్య వందో ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి బరిలో ఉంది. ఈ నేపథ్యంలో ఖైదీ నెం 150 సినిమా ఏ స్థాయి ఫలితాలు రాబడుతుందో చూడాలి. ఇప్పటివరకూ తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్ల జాబితాలో బాహుబలి ఉంది. 



మరి ఖైదీ నెంబర్ 150 బాహుబలి రికార్డులను అధిగమిస్తుందా.. ఈ ప్రశ్నకు మెగాస్టార్ కూడా స్పందించారు.  ఇలాంటి రికార్డుల గురించి తానేమీ అనుకోలేదని చిరంజీవి అంటున్నారు. ఐతే.. ఈ సినిమాను అమ్మేటప్పుడు బాహుబలి రేంజ్ లో అమ్మారని ఓ టాక్ ఉంది. మరి ఇప్పుడు ఫలితం కూడా అలా ఉంటుందా..

Image result for khaidi no 150

ఇదే ప్రశ్న చిరంజీవిని అడిగితే.. అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. తన సినిమా అంచనా మేరకే మార్కెట్ చేశామని.. ఏ సినిమానూ దృష్టిలో ఉంచుకోలేదని అన్నారు. కాకపోతే ఈస్ట్ లో ఖైదీ బాహుబలిని క్రాస్ చేసిందని గుర్తు చేశారు. ఐనా.. ఇలాంటి రికార్డులపై తాను పెద్దగా దృష్టి పెట్టనంటున్నాడు మెగాస్టార్. 



మరింత సమాచారం తెలుసుకోండి: