దాదాపు దశాబ్దం తర్వాత చిరంజీవి మేకప్ వేసుకున్నారు.. హీరోగా నటించారు. అందులోనూ యాక్షన్ ఓరియెంటెడే కాకుండా హీరోయిన్ తో చిందులేశారు. వయస్సును ఓ పది, పదిహేనేళ్లు తగ్గించేశారు. అమ్మడూ.. కుమ్ముడూ.. అంటూ రెచ్చిపోయారు. ఇది మెగా ఫ్యాన్స్ కు నిజమైన సంక్రాంతి పండుగే అనడంలో సందేహం ఏమాత్రం లేదు. 

Image result for chiranjeevi with kajal

అంతా ఓకే కానీ.. దాదాపు పదేళ్ల తర్వాత హీరోయిన్ పై చేయి వేయాల్సి వచ్చినప్పుడు మెగాస్టార్ ఎలా ఫీలయ్యారు. అందులోనూ తన కుమారుడు రాం చరణ్ పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేసిన అమ్మాయి పక్కన తాను స్టెప్పులు వేయాల్సిన వచ్చినప్పుడు చిరంజీవి ఏమనుకున్నారు. ఈ ఆసక్తికరమైన అంశాలు ఆయన మీడియాతో పంచుకున్నారు.

Image result for chiranjeevi with kajal
ఈ విషయాలు వివరించేటప్పుడు చిరంజీవి కుర్రాడిలా సిగ్గుపడ్డారు. ఫస్ట్ షాట్ లో కాజల్ భుజంపై చేయి వేసేందుకు కూడా వెనుకాడారట. బెరుకు బెరుకుగా బిహేవ్ చేశారట. చిరు బిహేవియర్ చూసి ఎందుకంత సిగ్గుపడ్డారంటూ ఆయన భార్య రేఖ కూడా అడిగారట. కాజల్ పై చేయి వేసేటప్పుడు చరణ్, బన్నీ గుర్తుకు వచ్చారట.

Image result for chiranjeevi with kajal
కానీ... డ్యూయెట్లలో కాజల్ మాత్రం బాగా సహకరించిందట. విచిత్రమేంటంటే.. కాజల్ తో చిరంజీవి నటించిన సీన్లలో మెగాస్టార్ కొత్త కొత్తగా బెరుగ్గా నటిస్తే.. కాజల్ మాత్రం మంచి అనుభవం ఉన్న దానిలా నటించిందట. అంటే సీన్ పూర్తిగా రివర్సయిందన్నమాట. మొత్తానికి అలా కాజల్ సహకారంతో మెగాస్టార్ డ్యూయెట్ల పర్వం పూర్తి చేశాడట.



మరింత సమాచారం తెలుసుకోండి: