తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటిస్తున్నారు.  వాస్తవానికి రెండు సంవత్సరాల క్రితమే సినిమాల్లో నటించాల్సి ఉన్నా మంచి కథకోసం వేచి ఉన్న చిరు తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’రిమేక్ తెలుగులో ‘ఖైదీ నెంబర్ 150 ’ చిత్రంతో ముందుకు వచ్చారు.  ఈ చిత్రంపై గత కొన్ని రోజుల నుంచి విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి.  చిరంజీవి పుట్టిన రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ నుంచి మొదలు పెడితో టీజర్, ట్రైలర్ వరకు దుమ్మురేపాయి.  
Image result for khaidi no 150 posters
అంతే కాదు చిరంజీవి చాలా యంగ్ గా కనిపిస్తూ..పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడూ కూడా అలాగే ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.  ఇక సినిమా  ఓవర్ సీస్ లో   ప్రీమియర్ షోలకు బీభత్సంగా కలెక్షన్లు వస్తున్నాయి. కేవలం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్లను వసూల్ చేసేలా ఉంది ఖైదీ నెంబర్ 150 చిత్రం.  ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ‘ఖైదీ నెంబర్ 150 ’చిత్రం పై పాజిటీవ్ టాక్ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా కావడం, ఆయనకిది 150వ సినిమా కావడం వంటి కారణాలతో ఖైదీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.  
Image result for khaidi no 150 posters
ఈ సినిమాలో  చిరంజీవి  బాగా వర్కవుట్స్ చేసి యంగ్ గా కనిపించి కనువిందు చేశారు.  ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన అసామాన్యమైన నటన, డైలాగులు, ఫైట్స్ తో థియేటర్లో దుమ్మురేపారు. ముఖ్యంగా ప్రతి పాటలోనూ చిరంజీవి వేసిన సూపర్ స్టెప్పులు ప్రేక్షకుల ఉత్సాహాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళేలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్. విజువల్స్ పరంగా చూసినప్పుడు ఆ పాటల స్థాయి మరింత పెరిగినట్లనిపించింది.
Image result for khaidi no 150 posters
కొరియోగ్రాఫర్లు లారెన్స్, జానీ మాస్టర్లు చిరంజీవి చేత వేయించిన స్టెప్పులు సినిమాకే మేజర్ హైలెట్ గా నిలిచాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ కీలక సన్నివేశాలన్నింటిలో దేవిశ్రీ అదరగొట్టాడు.  మొత్తానికి ‘ఖైదీ నెంబర్ 150’ యు ఎస్ , యూకే , యు ఏ ఈ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా కలెక్షన్ల కనక వర్షం కురుస్తోంది . ప్రస్తుతం ఈ చిత్రం ఎంత వరకు విజయం సాధించింది..లేదు అన్న విషయం రేపటి వరకు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: