Image result for fitness trainer rajesh with ram charan

ధృవ సినిమాలో రాం చరణ్ శరీరనిర్మాణం శరీరభాష శరీరశైలి పూర్తిగా కొత్తదనం సంతరించుకున్నాయి. నిజం చెప్పాలంటే రాం కొత్తగా ఒకరకమైన మెరుపు, నిశ్శబ్ధం ఆయనలో స్పష్ఠంగా కనిపించాయై. అసలింత షేప్ ట్రాన్స్ఫర్మేషన్ (రూపాంతరీకరణ) ఎలా జరిగింది. ఆ అద్భుతం వెనకున్న రహస్యమేమిటి? అన్నదానికి సరైన సమాధానం రాకెష్ ఉడియార్, ముంబైకి చెందిన ఫిట్నెస్ శిక్షకుడు.


నేడు సల్మాన్ ఖాన్ ఆమీర్ ఖాన్ల రూపాన్ని సృష్టించింది రాకేషే.  ఆ శిల్ప రూపం లోకి శరీర శైలిని మలిచిందీ రాకేషే. సల్మాన్ ఖాన్ ద్వారా రాకేష్ కు పరిచయమైన రాంచరణ్ దేహాన్ని నియంత్రిస్తూ శిల్ప శైలి ఆకృతిని మలచుకొని మంచి వర్కౌట్లు, ఆహార నియంత్రణ కాలరీల అదుపు ద్వారా నేటి దృవలోని ధృఢ రూపాన్ని తెచ్చాడు రాకేష్.  ఆయన శిక్షణలోనే కఠోర శ్రమ, వ్యాయామం, వర్కౌట్లు, ఆహార నియంత్రణ పాఠించిన రాం చరణ్ కు నేటి శరీర శిల్పం ఒనగూడిందట. అందుకే నేటి రాం చరణ్ రాకెష్ చెక్కిన శిల్పం.

Image result for fitness trainer rajesh with ram charan

రాకేష్ మాటల్లోనే:

"అప్పటికే రాం చరణ్‌ది మంచి ఫిజిక్‌. అయితే తన తర్వాతి సినిమా లోని పాత్రకు గాను "పూర్తి బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌" కావాలని ఆయన కోరుకున్నారు. అందుకు మూడు నెలల పైన సమయం మాకు పట్టింది. చరణ్‌ మంచి ఫిజిక్‌కు, అతను చాలా మంచి డ్యాన్సర్‌ కావడం కూడా ఒక కారణమని నేననుకుంటాను. అయితే చరణ్‌ కోసం రెగ్యులర్‌గా కాకుండా "ఎమ్‌టియుటి" (మెనస్‌ టైమ్‌ అండర్‌ టెన్షన్‌) స్టైల్‌ అనే  ఒక ప్రత్యేకమైన వర్కవుట్‌ డిజైన్‌ చేశాను. ఇదే అమీర్‌ఖాన్‌కి కూడా డిజైన్‌ చేశాను. ముందుగా ఆయన బాడీ లాంగ్వేజ్‌ని పరిశీలిస్తాను. అదే విధంగా చరణ్‌ను కూడా విశ్లేషించి ఆయన వర్కవుట్‌ని ప్లాన్‌ చేశాం.

రాంచరణ్‌ లక్ష్యానికి అనుగుణంగా సాధారణ కార్బో డైట్‌ ఫాలో అయ్యాడు. దాదాపు 1900-2000 కేలరీలు ఆహారం ద్వారా అందేలా చూసుకున్నాం. దీనిలో ప్రోటీన్‌, కార్బొహైడ్రేట్స్, ఫ్యాట్స్‌ అన్నింటినీ సమపాళ్లలో ఉండేలా ప్లాన్ చేసుకున్నాం"

ఉదయం, సాయంత్రం రెండు పూటలా వర్కవుట్‌స్ టైమింగ్స్‌ సెట్‌ చేసుకున్నాం. ఉదయం కనీసం 45 నిమిషాల  కార్డియోతో చరణ్‌ వర్కవుట్‌ ప్రారంభమయ్యేది. ఆ తర్వాత ఎమ్‌టియుటి పద్ధతిలో వర్కవుట్‌. అదే విధంగా సాయంత్రం గంట పాటు వర్కవుట్‌ తర్వాత 30 నిమిషాల పాటు కార్డియో ఉండేది.

నా దృష్టిలో ప్రతి ఒక్కరికీ కార్డియో వర్కవుట్‌ చాలా అవసరం. కనీసం 30 నిమిషాల నుంచి గంట వరకూ కార్డియో వ్యాయామాలు చేయాల్సిందే. అది శారీరక సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది. నియంత్రిస్తుంది. సాయంత్రం షూటింగ్‌ పూర్తయ్యాక 2 మజిల్‌ గ్రూప్స్‌ కి చేసేవారు. ఏ వర్కవుట్‌ అయినా రిపిటీషన్స్‌ కౌంట్‌ ఉండేది కాదు ఎంత చేయగలిగితే అంత అన్నట్టుండేది.

ఆయన వ్యాయామం జులైలో ప్రారంభించారు. దాదాపు నాలుగు నెలల్లోనే సిక్స్‌ప్యాక్‌ తో పాటు నేడు తనకున్న మీరు దృవ లో చూసిన మంచి ఫిజిక్‌ని సాధించారు. ఇదంతా ఆయన కృషి మాత్రమే. మేం డిజైన్ చేస్తాం, నియంత్రణ వ్యాయామం గైడ్ మాత్రమే చేయగలం.

చరణ్‌ చాలా పట్టుదల గల వ్యక్తి కావడంతో నా పని మరింత తేలికైంది -  రాం  చరణ్ ది గ్రేట్"  

మరింత సమాచారం తెలుసుకోండి: