తెలుగు ఇండస్ట్రీలో ఎటాంటి బ్యాగ్ గ్రౌండ్  లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నెంబర్ వన్ హీరో స్థానం సంపాదించిన చిరంజీవి నేటి తరం యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు. మాస్, క్లాస్, కామెడీతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి అభిమానుల గుండెల్లో అన్నయ్యగా నిలిచిపోయారు.  హీరోగా మంచి ఫామ్ లో ఉన్న చిరంజీవి ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రం తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న చిరంజీవి తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.  అయితే ఈ నిర్ణయానికి చాలా సమయంలో పట్టింది. మరోవైపు చిరంజీవి స్టామినా తగ్గిపోయిందని..అప్పటి చరిష్మా ఇంకా ఉంటుందా అని గుస గుసలాడారు.

Image result for khaidi no 150 posters

ఈ ఆలోచనలతోనే చిరంజీవి రెండు సంవత్సరాలు సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు ఆయన షష్టిపూర్తి రోజున పెద్ద నిర్ణయం తీసుకున్నారు.  ఇక చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించేద ఎవరూ అన్న ప్రశ్నలు తలెత్తాయి. చాలా మంది లీస్టులో వచ్చారు..మొత్తానికి ఠాకూర్ లాంటి బ్లాక్ బ్లస్టర్ ఇచ్చిన వివివినాయక్ ఖరారు అయ్యారు.  అయితే హీరోయిన్ల విషయంలో కూడా చాలా తర్జన భర్జనలు అయ్యాయి. చివరకు మెగా హీరోలతో నటించిన అందాల భామ కాజల్ ఫైనల్ అయ్యింది. ఇక సంగీతం అందించడానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ఉండనే ఉన్నారు. ఈ తరుణంలో తమిళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం తెరపైకి వచ్చింది. 

Image result for khaidi no 150 posters

ఈ సినిమా షూటింగ్ షరవేగంగా పూర్తి చేసుకొని చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ‘ఖైదీ నెంబర్ 150’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తర్వాత టీజర్ విడుదల కావడంతో అప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు మొదలయ్యాయి. చిరంజీవి గత పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పూడూ అలా ఉన్నారని టీజర్ చూసిన తర్వాత తెలిసింది. ఇక ట్రైలర్ విడుదల తర్వాత ఆయన రేంజ్ ఏంటో చూసి అందరూ నోళ్లు వెల్లబెట్టారు.  ఇక ఖైదీ నెంబర్ 150 చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

Image result for khaidi no 150 posters

అయితే మొన్న  యూకే అండ్ యు ఏ ఈ సెన్సార్ బోర్డు మెంబర్ ఫిలిం క్రిటిక్ కూడా అయిన ఉమైర్ సందు ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని చూసి తన రివ్యూ ని ఇచ్చారు.   ఈ చిత్రానికి ఆయన 4/5 రేటింగ్ ఇవ్వడమే కాకుండా సినిమా ఫుల్ మాస్, మెసేజ్ ఓరియెటెండ్ సినిమా అని అన్నారు. నిన్న రిలీజ్ అయిన సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టించింది. ఎక్కడ చూసినా చిరు మానియా మొదలైంది.  బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు మొదలు పెట్టారు.

Image result for khaidi no 150 posters

సినిమాలో చిరంజీవి వన్ మాన్ షో చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు.  డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్స్ అద్భుతంగా ఉన్నాయని..రెండు పాత్రల్లో చిరంజీవి ప్రాణం పోశారని తెగ పొగిడేస్తున్నారు. రికార్డులు బద్దలు అవుతున్నాయి..మెగాస్టార్ ఫ్యాన్స్ పూనకం వచ్చిన వాళ్లలా మారిపోయారు. ఇండస్ట్రీలో సెలబ్రెటీలు సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.  మొత్తానికి చిరంజీవి ఎప్పటికీ నెంబర్ వన్ అంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: