నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై అంతటా ఉత్కంఠ నెలకొన్నవేళ.. దర్శకరత్న రాజమౌళిపై తన రివ్యూ ప్రకటించేశాడు. సాధారణంగా అద్భుతంగా ఉన్న సినిమాలను ప్రశంసించేందుకు రాజమౌళి ఎప్పుడూ వెనుకడుగు వేయడు. అంతేకాదు.. తన ప్రోత్సాహక వ్యాఖ్యలతో మరింతగా  వెన్నుతడతాడు.



గౌతమీపుత్ర శాతకర్ణి ప్రివ్యూ చూసిన రాజమౌళి ఒకింత ఎక్కువగానే స్పందించాడు. ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలకృష్ణ, క్రిష్, సాయిమాధవ్.. ఇలా ఈ సినిమాకు పనిచేసినవారిని పేరు పేరునా ఆకాశానికెత్తేశాడు రాజమౌళి. ఈ సినిమా తనకు నందమూరి తారక రామారావుగారిని గుర్తు చేసిందంటూ చేసిన ప్రశంస బాలయ్య అభిమానులకు పండుగే.



రాజమౌళి ట్వీట్ల వర్షం ఇలా సాగింది.. సాహో.. బసవతారకరామ పుత్ర బాలకృష్ణ.. శాతకర్ణిగా మీ విశ్వరూపం నందమూరి తారక రామారావుగారిని తలపించింది. ఇంతటి మహా కావ్యాన్ని 79 రోజుల్లో ఎలా రూపొందించగలిగారు.. క్రిష్ నుంచి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.. 



సాయి మాధవ్.. మీ కలం శాతకర్ణి ఖడ్గంగా మారింది. అద్భుతమైన కెమేరా పనితనం.. అసాధారణ నిర్మాణ విలువలు.. శాతకర్ణి ఓ గొప్ప తెలుగు చిత్రంగా చరిత్రలో నిలచిపోతుంది.. ఇలా సాగాయి దర్శకరత్న ట్విట్లు.. సో.. దర్శకరత్నను ఇంతగా అలరించిందంటే ఇక ఆ సినిమా బంపర్ హిట్టే.. అనుమానం ఏముంది.



మరింత సమాచారం తెలుసుకోండి: