తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి బరిలో అగ్రహీరోల హవా మొదలైంది. నిన్న భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం హిట్ టాక్ తో నడుస్తుంది.  కాగా ఈ రోజు నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన వందవ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  అఖండ భరత జాతి అంటూ కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి జీవిత కథ ఆధారంగా చారిత్రక నేపథ్యంతో దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించారు. చిరంజీవి 150వ సినిమాతో పోటాపోటీగా సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  
Image result for goutamiputra satakarni posters
క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించడంతో 'శాతకర్ణి'పై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు సినిమా ట్రైలర్ కూడా బాగుండటంతో ఈసారి సంక్రాంతి బరిలో నిలిచారు.  ఇక ఉదయం నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. జై బాలయ్య... జైజై బాలయ్య అనే నినాదంతో థియేటర్లు మారుమోగుతున్నాయి. బెన్‌ఫిట్ షో చూసిన అభిమానులు మరోసారి బాలయ్యే సంక్రాంతి హీరో అంటున్నారు. ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా చూసిన కామన్ ఆడియన్స్ స్పందన కూడా బాలయ్య కెరీర్‌లో ఓ మంచి సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి నిలిచిపోతుందని చెబుతున్నారు.
Image result for gautamiputra satakarni
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయట. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఈ సినిమాలో గౌరవం దక్కిందని ప్రేక్షకులు చెబుతున్నారు.  మొదటి నుంచి చారిత్రక నేపథ్యంలో వచ్చిన చిత్రాలు అంటే తెలుగు వారు బాగా ఆదరిస్తారు. ఈ నేపథ్యంలో గౌతమి పుత్ర శాతకర్ణీపై పబ్లిక్ టాక్ పాజిటీవ్ గా ఉన్న మరి కొద్ది సేపట్లో పూర్తి రిజల్ట్ రానుంది.
Image result for gautamiputra satakarni
అయితే బెనిఫిట్ షో చూసినా నందమూరి అభిమానులు మాత్రం ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుందని తెగ పొగిడేస్తున్నారు.   ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు బాలయ్య నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: