తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్స్ పదేళ్లుగా ఎదురు చూస్తున్న ఆశలు ఫలించాయి..తమ అభిమాన హీరోని తెరపై ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మాస్, క్లాస్, కామెడీ,సోషల్ మెసేజ్ తో వచ్చి సందడి చేశారు.  దీంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ సందడి చేసారు.  చిరంజీవి చాలాకాలం తర్వాత నటించిన చిత్రం కావడంతో మొదటి నుండి ఈ చిత్రం పై భారీ  అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా భారీ ఓపెనింగ్స్ సాధించడం తో మొదటి రోజు కలెక్షన్ల పరంగా కనక వర్షం కురిపించింది.  
Image result for khaidi no 150 posters
మొన్నటి వరకు పెద్ద నోట్ల ఇబ్బందితో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న ప్రేక్షకులు ఆ ఇబ్బంది కాస్త తగ్గడంతో ఎంట్రటైన్ మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు.  అందులోనూ సంక్రాంతి పండుగ వాతావరణం..సెలవులు అన్నీ కలిసి వస్తున్నాయి.  ఇక నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ 150 చిత్రం ఎన్ని కోట్ల ని కలెక్ట్ చేసిందో తెలుసా షాక్ అవ్వాల్సిందే.  మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం వరల్డ్ వైడ్ గా 35 నుంచి 40 కోట్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు .
Image result for khaidi no 150 posters
ఇంత పెద్ద మొత్తంలో వసూల్ కావడానికి కారణం చిరు మానియా అని అంటున్నారు.   చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తర్వాత నటించిన చిత్రం కావడంతో ఖైదీ నెంబర్ 150 పై భారీ అంచనాలు నెలకొన్నాయి .ఇంకా సరైన ఫిగర్ తేలలేదు కానీ 35 కోట్ల నుండి 40 కోట్ల వరకు ఆ ఫిగర్ ఉండటం ఖాయమని దీన్ని బట్టే మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.  
Image result for khaidi no 150 posters
ఈ సినిమాలో రైతు గురించి పోరాటం..చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ అన్ని అద్భుతంగా పండాయని అందుకే సినిమాకు ఇంత మంచి ఆదరణ లభిస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు.  ఈ వారం సంక్రాంతి సెలవులు ఉండటంతో కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: