తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  డ్యాన్స్, ఫైట్స్ లో కొత్త వరవడి తీసుకు వచ్చి తెలుగు ఇండస్ట్రీ ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు మెగాస్టారు.  మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీలో వచ్చినా ఆయన స్థానాన్ని మాత్రం ఎవరూ భర్తి చేయలేక పోయారు.  ఇక తొమ్మిదేళ్ల విరామం తర్వాత కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి.  
Related image
‘ఖైదీ నెంబర్ 150’ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ చిత్రంపై అనూహ్యమైన అంచనాలు పెరిగిపోయాయి.  అభిమానుల అంచనాలకు తగ్గటే తన సినిమాలో మాస్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా జాగ్రత్త పడ్డాడు చిరంజీవి. దీంతో ఆయన నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్‌ 150’ రికార్డ్‌ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఆడియో సూపర్ హిట్ కావటంతో పాటు చిరు లుక్స్ ఆకట్టుకోవటంతో ఖైదీ నంబర్ 150 భారీ ఓపెనింగ్స్ సాధించింది. గతంలో రికార్డులు సాధించిన ప్రతీ తెలుగు సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ చెప్పుకునేది.
Image result for baahubali
కానీ ఖైదీ దెబ్బకు బాహుబలి రికార్డ్స్ కూడా చెరిగిపోయాయంటున్నారు ఫ్యాన్స్.   తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను సాధించిన ఖైదీ నంబర్ 150 ఒక్క రోజులో 39 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగెస్ట్ హిట్గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లతో సరిపెట్టుకోగా ఖైదీ నంబర్ 150, ఆ రికార్డ్ను దాటి కొత్త చరిత్ర సృష్టించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: