దీపికా పదుకునే.. బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఇలాంటి సక్సస్ ఫుల్ హీరోయిన్ లేదేమో.. మొదట్లో ఇబ్బంది పడినా ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. అంతేకాదు.. కేవలం బాలీవుడ్ తో సరిపెట్టుకోకుండా హాలీవుడ్ లోనూ తళుక్కున మెరుస్తోంది. తాజాగా త్రిబుల్ ఎక్స్ .. రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ అనే సినిమాలో నటించింది. 



ఐతే.. ఇటీవల ముంబైలో జరిగిన  సినిమా ప్రమోషన్ సమయంలో దీపికా పడుకునే వేసుకున్న డ్రస్సు చూసి అంతా అవాక్కయ్యారు. హాలీవుడ్ సినిమాలో నటించిన దీపికా డ్రస్సింగ్ లోనూ అదే స్పిరిట్ చూపించింది. దాంతో ఊరిస్తున్న దీపికా అందాలు చూస్తూ అంతా అవాక్కయ్యారు. మరి కేవలం హాలీవుడ్ సినిమాలో నటిస్తే సరిపోతుందా.. ఎక్స్ పోజింగ్ కూడా అదే రేంజ్ లో ఉండొద్దూ..


ముంబై పీవీఆర్ సినిమాలో జరిగిన ఈ కార్యక్రమంలో త్రిబుల్ ఎక్స్ సినిమా హీరో విన్ డీజిల్ తో కలసి దీపికా పాల్గొంది. ఈ కార్యక్రమంలో సదరు హాలీవుడ్ నటుడుకి మన సౌతిండియా లుంగీని పరిచయం చేసింది దీపికా. గతంలో లుంగీ సాంగ్ తో అదరగొట్టిన ఈ అమ్మడు.. విన్ డీజిల్ కు లుంగీ కట్టేసింది. చివరకు తాను కూడా లుంగీ కట్టిసందడి చేసేసింది. 

దీపికా క్లీవేజ్ షో..


విన్ డీజిల్ కు లుంగీ కడుతున్నదీపికా


లుంగీ డాన్స్ తో దీపికా హల్ చల్.. 



ముంబై పీవీఆర్ సినిమాలో దీపికా సందడి..



మరింత సమాచారం తెలుసుకోండి: