తమిళనాట ఇప్పుడు జల్లకట్టుపై రగడ మొదలైంది. జల్లికట్టు పోటీల కోసం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పోటీ నిర్వహణకు సుప్రీంకోర్టు కళ్లెం వేసివుండగా, కేంద్రం కూడా తమకేం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తోంది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వ్యతిరేకంగా సినీనటి త్రిష ప్రచారం నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ చెన్నైకు 450 కి.మీ.ల దూరంలో జరుగుతున్న త్రిష చిత్ర షూటింగ్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. పెటా కార్యకర్తగా ఉన్న త్రిష జల్లికట్టు క్రీడను వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో శివగంగలో జరుగుతున్న గర్జన చిత్ర షూటింగ్‌ పలువురు జల్లికట్టు మద్దతుదారులు అడ్డుకున్నారు. వ్యానులో ఉన్న త్రిష బయటకు రావాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తతతకు దారితీయడంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.  మరోవైపు పొగరుబోతు ఎద్దులను చిత్రహింసలకు గురిచేసే జల్లికట్టు పోటీలు వద్దనే వద్దంటూ నటి త్రిష కామెంట్స్ చేసింది. ఇది తమిళ ప్రజలతో పాటు.. జల్లికట్టు నిర్వాహకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.  

తమ సాంప్రదాయ క్రీడపై ప్రచారం చేస్తున్న త్రిషపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు తమిళ తంబీలు..త్రిష క్షమాపణలు చెప్పడంతో పాటు జంతు సంరక్షణ హక్కుల సంస్థకు ఇచ్చిన మద్దతు వెనక్కి తీసుకోవాలని.. అప్పటివరకూ చిత్రీకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతే కాదు జల్లుకట్టుపై నిషేధానికి కారణమైన పెటా సంస్థ, ఆ సంస్థకు ప్రచారకులుగా ఉన్న నటీనటులపై కొందరు మరింత తెగబడ్డారు.

‘పెటా ప్రచారకర్త, నటి త్రిష.. ఇక లేరు’ అంటూ సోషల్‌ మీడియాలో అభ్యంతరకర మెసేజ్‌లు, ఫొటోలను పోస్ట్‌చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో తనను చంపేసిన వైనాన్ని, సంబంధిత ఫొటోను స్వయంగా త్రిషయే తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: