గత సంవత్సరం విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అద్భుత కలెక్షన్లు సాధించిన అమీర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్' 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. 62వ ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమం సినీ తారల తళుకు బెళుకుల మధ్య అంగరంగ వైభంగా జరిగింది. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ కీలక పాత్రలో నటించిన ‘దంగల్‌’ పలు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా పలు అవార్డులను అందుకుంది. జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ - 2017 పూర్తి జాబితా ఇది.



ఉత్తమ నటుడు: ఆమిర్‌ఖాన్‌(దంగల్‌) 
ఉత్తమనటి: అలియా భట్‌(ఉడ్తా పంజాబ్‌) 
ఉత్తమ చిత్రం: దంగల్‌ 
ఉత్తమ దర్శకుడు: నితీశ్‌ తివారీ(దంగల్‌) 
ఫిలింఫేర్‌ క్రిటిక్స్‌ ఉత్తమ నటుడు: షాహిద్‌ కపూర్‌(ఉడ్తా పంజాబ్‌), మనోజ్‌బాజ్‌ పాయ్‌(అలీఘర్‌) 
ఫిలింఫేర్‌ క్రిటిక్స్‌ ఉత్తమ నటి: సోనమ్‌ కపూర్‌(నీర్జా) 
ఉత్తమ నటుడు(లఘుచిత్రం): మనోజ్‌ బాజ్‌పాయ్‌(తాండవ్‌) 
ఉత్తమనటి(లఘుచిత్రం): టిస్కా చోప్రా(చట్నీ) 
ఉత్తమ పరిచయ దర్శకుడు: అశ్విన్‌ అయ్యర్‌ తివారీ (నిల్‌ బేటే సంతా) 
ఉత్తమ పరిచయ నటుడు: దిల్జీత్‌ దోసాంజ్‌(ఉడ్తా పంజాబ్‌) 
ఉత్తమ పరిచయ నటి: రితికా సింగ్‌ (సాలాఖడూస్‌) 
ఉత్తమ మాటల రచయిత: రితేశ్‌ షా(పింక్‌) 
ఉత్తమ స్క్రీన్‌ప్లే: షకున్‌ భత్రా, అయేషా దేవిత్రి థిల్లాన్‌(కపూర్‌ అండ్‌ సన్స్‌) 
ఉత్తమ కథ: షకున్‌ భత్రా, అయేషా దేవిత్రి థిల్లాన్‌(కపూర్‌ అండ్‌ సన్స్‌) 
ఉత్తమ సహాయ నటుడు: రిషి కపూర్‌ (కపూర్‌ అండ్‌ సన్స్‌) 
ఉత్తమ సహాయనటి: షబనా అజ్మీ (నీర్జా) 
ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు: శతృఘ్న సిన్హా 
ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్‌ (యే దిల్‌ హై ముష్కిల్‌) 
ఉత్తమ నేపథ్య గాయకుడు: అర్జిత్‌సింగ్‌(యే దిల్‌ హై ముష్కిల్‌) 
ఉత్తమ నేపథ్య గాయని: నీహా భాసిన్‌ (సుల్తాన్‌) 
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌: రెడ్‌ చిల్లీస్‌(ఫ్యాన్‌) 
ఉత్తమ ఎడిటింగ్‌: మోనిషా బల్దవా(నీర్జా) 
ఉత్తమ కాస్ట్యూమ్‌: పాయల్‌ సలూజా(ఉడ్తా పంజాబ్‌) 
ఉత్తమ యాక్షన్‌: శ్యామ్‌ కౌశల్‌(దంగల్‌)



 




మరింత సమాచారం తెలుసుకోండి: