Image result for Latest telugu movies at overseas

ఓవర్సీస్ లో విజయం సాధించాలంటే కథాబలమున్న కుటుంబ చిత్రాలు, వెరైటీ కథ కథనాలు, టేకింగ్, హాస్యం, దేశభక్తి పూరిత భారతీయ ఇమోషణల్ హిస్టరి బేస్డ్ సినిమాస్ ఏవరు నిర్మించినా ఎవరు నటించినా చక్కగా వారాంతములో చూస్తారు. విదేశాల్లో నివసించే మనవాళ్ళకి మన సంస్కృతి, సాంప్రదాయాలు, దేశచరిత్ర, దేశభక్తి పూరిత  వీరోచిత గాధలు, బాహుబలి లాంటి కల్పితకథలు గాధలు, చక్కటి సాంకేతిక విలువలతో కూడిన పౌరాణికాలు లలిత కళల నేపధ్యం బాగా నచ్చుతుంది.  

Image result for Latest telugu movies at overseas

అగ్ర  కథానాయకుడి సినిమా విడుదల రోజు  హైదరాబాదైనా, అమరావతైనా, అమెరికా ఐనా పెద్ద తేడా ఏమీ ఉండటం లేదు. అక్కడా ఇక్కడా ఒకటే సందడి. బాక్సాఫీసు ముందు జనం జాతరే. థియేటర్లన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోవాల్సిందే. ఇదివరకు తెలుగు సినిమా విడుదలైందనగానే నైజాం టాక్‌ ఏంటి? సీడెడ్‌లో ఏమనుకుంటున్నారు? ఆంధ్రలో వసూళ్లు ఎలా ఉన్నాయి? అని ఆరా తీయడం కనిపించేది. ఇప్పుడు ఓవర్సీస్‌ నుంచి ఏం రిపోర్ట్‌ వచ్చిందంటూ, మొదట అటువైపు చూస్తున్నారు. 

Image result for Latest telugu movies at overseas

దీని బట్టి ఓవర్సీస్‌ మార్కెట్‌ ఎంత కీలకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి సినిమా బాగుందన్న రిపోర్ట్‌ వచ్చిందంటే చాలు సగం విజయం దక్కినట్టే పరిగణిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఓవర్సీస్‌ హీరోలు, ఓవర్సీస్‌ దర్శకులు అంటూ మొన్నటిదాకా కొంతమందికే గుర్తింపుండేది. వాళ్ల సినిమాలు విడుదలైనప్పుడే విదేశాల్లో సందడి, అక్కడి ప్రేక్షకుల్లో అంచనాలు కనిపించేవి. దాంతో కొన్ని చిత్రాలే అక్కడ బలంగా మార్కెట్‌ అయ్యేవి. 

Image result for Latest telugu movies at overseas

కానీ ఇటీవల ఆ లెక్కలు మారిపోతూ వచ్చాయి. వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా కథానాయకులంతా ఓవర్సీస్‌ మార్కెట్‌ని ఓ పట్టు పట్టేందుకు నడుం బిగిస్తున్నారు, విజయం సాధిస్తున్నారు. దాంతో తెలుగు సినిమాలకు డాలర్ల పంట పండు తోంది. మిలియన్‌ డాలర్ల క్లబ్బులో విరివిగా మన సినిమాలు చేరిపోతున్నాయి.

Image result for Latest telugu movies at overseas

తొలినాళ్లలో తెలుగు సినిమాకి సంబంధించిన లెక్కలు వారాలు, 50 రోజులు, 100 రోజులు అంటూ రోజుల రూపంలో వినిపించేవి. ఇప్పుడు వాటి స్థానంలో రూ.100 కోట్ల క్లబ్‌, రూ.50 కోట్ల క్లబ్‌ అంటూ కొత్త లెక్కలు వినిపిస్తున్నాయి. సినిమా ఎన్ని రోజులు ఆడిందనే సంగతిని పక్కనబెట్టి, ఎంత వసూలు చేసిందనే విషయమే ప్రామాణికంగా మారింది. ఈ లెక్కల్లో ఓవర్సీస్‌ వసూళ్లు కీలకంగా మారాయి. అక్కడ నుంచి మిలియన్‌ డాలర్ల క్లబ్‌, హాఫ్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌ అంటూ ఓ లెక్క వినిపించిందంటే దర్శకనిర్మాతలకి, అభిమానులకి బోలెడంత వూరట. 

Image result for Latest telugu movies at overseas

తెలుగుసినిమాకి ఓవర్సీస్‌ మార్కెట్‌లో కంచుకోట అంటే అమెరికానే. అక్కడి నుంచే అధిక భాగం వసూళ్లొస్తాయి. అమెరికాలో సినిమా వసూళ్లు మిలియన్‌ డాలర్లు వచ్చాయంటే ఆ సినిమా అరుదైన ఫీట్‌ సాధించినట్టు భావిస్తుంటారు. మిలియన్‌ డాలర్లక్లబ్‌ అనేమాట ఎక్కువగా మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్‌ సినిమాల విషయంలోనే వినిపిస్తుంటుంది. దర్శకుల్లో ఎస్‌.ఎస్‌.రాజమౌళి, త్రివిక్రమ్‌, శ్రీనువైట్ల, కొరటాల శివ ఇలా కొంతమంది తెరకెక్కించిన చిత్రాలపైనే ఆ ఆశలుండేవి. 

Image result for Latest telugu movies at overseas

ఇటీవల మిగిలిన కథానాయకులు, దర్శకులు కూడా సత్తా చాటుతున్నారు. గతేడాది నాగార్జున, రామ్‌చరణ్‌, నితిన్‌తో పాటు విజయ్‌ దేవరకొండ లాంటి కొత్త తరం కథానాయకుడూ మిలియన్‌ డాలర్ల మార్క్‌ని "పెళ్ళిచూపులు" సినిమా తో సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే చిరంజీవి, బాలకృష్ణ తమ సత్తాచాటారు. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమాల జోరు చూస్తుంటే మిలియన్‌ డాలర్లక్లబ్‌ అనేది సర్వసాధారణమైన విషయంగా మారేలా కనిపిస్తోంది.

Image result for soggade chinni nayana

గత ఐదారేళ్ల నుంచి తెలుగుసినిమా వసూళ్లలో డాలర్‌ ప్రభావం బలంగా కనిపిస్తోంది. తెలుగు సినిమాలకి సగం వసూళ్లు ఓవర్సీస్‌ నుంచే వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఆ విషయం తెలిసినప్పట్నుంచి దర్శకనిర్మాతలు కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటు న్నారు. ఓవర్సీస్‌ ప్రేక్షకులకి నచ్చే అంశాలు మన కథలో ఉన్నాయా? లేవా? అని ఒకటికి రెండుమార్లు సరిచూసుకొనే పరిస్థితి వచ్చింది. అక్కడ మార్కెట్‌పై ప్రభావం చూపాల్సిందే అని కథానాయకులు ప్రయ త్నాలు చేయడం మొదలెట్టారు. 

Image result for Latest telugu movies at overseas

ఆ విషయంలో రామ్‌చరణ్‌ విజయం సాధించారు కూడా. "ధృవ" వరకూ ఆయన సినిమాలేవీ అమెరికాలో మిలియన్‌ డాలర్ల క్లబ్బులో చేరలేదు. ఎట్టకేలకు ధృవ తో ఆ ఫీట్‌ సాధించారాయన. ఓవర్సీస్‌ ప్రేక్షకులకి నచ్చే కథాంశం కావడంతో, మొదట్నుంచీ నమ్మకంతో ఉన్న రామ్‌చరణ్‌ సినిమా విడుదలవ్వగానే అమెరికా వెళ్లి ప్రీమియర్‌ షోల్లో పాల్గొన్నాడు. 

Image result for Latest telugu movies at overseas


బాహుబలి వరకు ప్రభాస్‌ సినిమాలు కూడా ఓవర్సీస్‌లో మిలియన్‌ డాలర్లు వసూలు చేయలేదు. బాహుబలికి ఏకంగా "ఏడు మిలియన్‌ డాలర్ల" కు పైగా వసూళ్లొచ్చాయి. చిరంజీవి తొమ్మిదేళ్లక్రితం సినిమా చేసినప్పుడు ఓవర్సీస్‌హంగామా ఈ స్థాయిలో ఉండేది కాదు.ఆయన పునః ప్రవేశ చిత్రం "ఖైదీ నంబర్‌ 150"  అమెరికాలో ఇప్పటికే రెండు మిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించటానికి దగ్గర్లో ఉన్ది.

Image result for Latest telugu movies at overseas

"గౌతమిపుత్ర శాతకర్ణి" తోనూ బాలకృష్ణ మిలియన్‌ డాలర్ల హీరో అనిపించుకున్నారు. నాగార్జున "వూపిరి" తో ఆ మార్క్‌ని చేరుకున్నారు. ఆయన గతేడాది నటించిన "సోగ్గాడే చిన్నినాయనా" కి మంచి వసూళ్లే లభించాయి. నితిన్‌ "అఆ" తో రెండు మిలియన్ల డాలర్లక్లబ్‌ హీరో అయిపోయారు.

Related image


నాని నటించిన ఈగ, భలే భలే మగాడివోయ్‌ మిలియన్‌ డాలర్లక్లబ్‌లో చేరాయి. స్టార్‌ కథానాయకుల చిత్రాలకే కాకుండా ‘పెళ్ళిచూపులు’ లాంటి చిన్నసినిమాలకీ మిలియన్‌డాలర్ల వసూళ్లని కట్టబెట్టారు ఓవర్సీస్‌ ప్రేక్షకులు. సంక్రాంతి సంద ర్భంగా విడుదలైన శర్వానంద్‌ "శతమానం భవతి" అమెరికాలో మంచి వసూళ్లని సాధిస్తోంది. ఇటీవల కథాబలమున్న చిత్రాలు విరివిగా తెరకెక్కుతున్నాయి కాబట్టి మరింత మంది కథానాయకులు ఓవర్సీస్‌లో సత్తా చాటేలా కనిపిస్తున్నారు.

Image result for Latest telugu movies at overseas

మరింత సమాచారం తెలుసుకోండి: