తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’. ఈ చిత్రం ప్రారంభం నుంచి ఎన్నో అంచనాలు పెరుగుతూ వచ్చాయి.  ఫస్ట్ లుక్ మొదలు ట్రైలర్ వరకు సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశాయి.  ఈ నెల 12 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ అన్ని కేంద్రాల్లో హిట్ టాక్ వచ్చింది.   ఈ చిత్రంలో  బాలకృష్ణ నట విశ్వరూపం చూసి తెలుగు ఇండస్ట్రీ మొత్తం ప్రశంసల జల్లు కురిపించింది.  ఇక డైరెక్టర్ గా క్రిష్ మరో విజయాన్ని తన ఖాతలో వేసుకోవడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.  
Image result for gautami putra satakarni
ఈ చత్రంలో మరో స్పెషల్  పులోమావి’గా నటించిన ఆ బాలుడు.   గౌతమి పుత్ర శాతకర్ణీ తనయుడిగా నటించిన పులోమావి అసలు పేరు స్నేహిత్ చౌదరి.  ‘తాత.. వీడ్ని నువ్వు చంపుతావా.. నన్ను చంపమంటావా’ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో ఆకట్టుకున్నాడు ఓ కుర్రాడు. సినిమా మొత్తంలో ముద్దుముద్దు మాటలు చెబుతూ అందరి హృదయాల్ని దోచుకున్నాడు.  ఇక సినిమా ముందు ఎన్నో రిహాసల్స్ చేసిన తర్వాత కెమెరా ముందు డైలాగ్స్ కొడతారు.  
Image result for gautami putra satakarni
కానీ ఈ చిచ్చర పిడుగు మాత్రం ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో చెప్పిన భారీ డైలాగ్‌ని చెప్పాడంటే.. అతని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.  ఓ ప్రముఖ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్దుముద్దు మాటలు చెబుతూ అందరి హృదయాల్ని దోచేశాడు స్నేహిత్. ఖమ్మంజిల్లా బూడిదంపాడుకి చెందిన  స్నేహిత్ చౌదరి  ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలోని ఎన్టీఆర్ డైలాగ్స్ ఎలా చెప్పాడో ఓ లుక్కెయ్యండి. 

Image result for gautami putra satakarni


మరింత సమాచారం తెలుసుకోండి: