సూపర్ స్టార్ మహేష్ తో మురుగదాస్ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాపై ఎలాంటి అప్డేట్ లీక్ అవ్వకుండా చేస్తున్న చిత్రయూనిట్ సినిమా టీజర్ ను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. అయితే సినిమా టార్గెట్ కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా భారీ హిట్ సాధించాలని మహేష్ మెగా ప్లాన్. అందుకే సినిమాలో కాస్ట్ అండ్ క్రూ మొత్తం అక్కడ వారినే సెలెక్ట్ చేసుకున్నారట.


మహేష్ కెరియర్ లో మొదటి సారి బైలింగ్వల్ మూవీగా రాబోతున్న ఈ సినిమా మురుగదాస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు సూర్యకు తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఏర్పడిందో అదేవిధంగా తమిళంలో మహేష్ కు ఆ క్రేజ్ తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమాలో విలన్ గా ఎస్.జె.సూర్యను తీసుకోగా.. మరో విలన్ గా భరత్ కనిపిస్తున్నాడు. ఇక కమెడియన్స్ కూడా అక్కడ మంచి క్రేజ్ ఉన్న వారినే తీసుకుంటున్నారట.


పెళ్లిచూపులుతో బాగా ఫేమస్ అయిన ప్రియదర్శి ఈ సినిమాలో మహేష్ పక్కన కమెడియన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ రోల్ ను కోలీవుడ్ లో ప్రేం జీ అమరన్ నటిస్తున్నాడు. సో ఇన్నాళ్లు తెలుగు మార్కెట్ మీదే కాన్సెంట్రేట్ చేసిన మహేష్ ఇప్పుడు కోలీవుడ్ మీద కన్నేశాడని చెప్పొచ్చు. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ నెలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న మహేష్ మూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: