గతవారం వచ్చిన సంక్రాంతికి నాలుగు  సినిమాలు విడుదలయ్యాయి అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణ ప్రేక్షకుల దృష్టిలో  మాత్రం కేవలం మూడు సినిమాలు మాత్రమే విడుదల అయినట్లుగా ఫీల్ అవుతున్నారు. ఈ సంక్రాంతి రేస్ కు వచ్చిన  నాలుగో సినిమా ఆర్. నారాయణమూర్తి హీరోగా నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ అన్న విషయం కూడా తెలియని పరిస్థితి  ఏర్పడింది. తన సినిమాకు  ధియేటర్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారంటూ నారాయణమూర్తి గొంతెత్తిన తరువాత మాత్రమే  ఈసినిమా గురించి  మీడియా కూడ పట్టించుకోవడం మొదలు పెట్టింది. 

ఈపరిస్థితులు ఇలాఉండగా ఈసినిమాకు షరా మామూలుగానే కనీసపు థియేటర్స్ దొరకకపోవడమే కాకుండా ఈసినిమాకు కనీసపు కలెక్షన్స్ కూడ రాలేదు. అయితే తాజాగా ఈసినిమా సక్సస్ మీట్ ను ఏర్పాటు చేసిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు టాలీవుడ్ ఇండస్ట్రీ పోకడను చీల్చిచెండాడారు. తెలుగు సినీపరిశ్రమలో అతినీచమైన సంస్కృతి దాపురించినదని తమ సినిమానే ఆడాలి, పక్కవాళ్ళ సినిమా కూడా ఆగిపోయి, ఆ కలెక్షన్ కూడా నాకే రావాలన్న దౌర్భాగ్యం ఈతెలుగు సినీ పరిశ్రమలో ఉందని తీవ్రంగా మండిపడ్డారు.

ఇదే సందర్భంలో ఈనిర్మాత  మాట్లాడుతూ  ‘ఒక మనిషి సినిమా స్క్రీన్ పైన ‘మెగాస్టార్’ కాదు, రియల్ లైఫ్ లో ‘మెగాస్టార్’ లా ఉండాలి’  అంటూ చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్  గా మారింది. నెల్లూరు నుండి మొదలుపెడితే ఆంధ్రా బోర్డర్ వరకు  తనకు ఒక్క ధియేటర్ కూడా ఇవ్వలేదని కనీసం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా  తనకు ధియేటర్స్  దొరకని  నీచాతినీచమైన పరిస్థితి ఉంది అంటూ షాకింగ్ నిజాలను బయటపెట్టాడు. 
 

ఇదే సందర్భంలో చదలవాడ మాట్లాడుతూ సినిమా హీరోగా బ్రతకడం కాదు, రియల్ గా, రియల్ హీరోగా కూడా బ్రతకడం నేర్చుకోండి అంటూ టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసాడు. ఇదే సందర్భంలో ఈనిర్మాత మాట్లాడుతూ ఇండియాలో ఉన్న అందరి హీరోలతో కూడా సినిమాలు తీసే స్టామినా  తన  దగ్గర ఉంది అని అంటూ  ‘అయితే మీతో సినిమాలు చేసేటంత పాపపు పని నేనెప్పుడూ చేయను. నేను చిన్న సినిమాలే తీస్తాను, మంచి సినిమాలే తీస్తాను’  అంటూ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు చదలవాడ శ్రీనివాసరావు. 

దీనితో ఈ  మీడియా మీట్ కు వచ్చిన మీడియా వర్గాలు చదలవాడ వ్యక్త పరిచిన ఆవేదనలో అర్ధం ఉంది అని కామెంట్ చేసుకున్నట్లు టాక్. దీనితో నిర్మాత చదలవాడ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారు ? అన్నదే కీలకంగా మారి ఆ కామెంట్స్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నిర్మాత చదలవాడ  తన స్పీచ్ లో  రెండు మూడు సందర్భాలలో ‘మెగాస్టార్’ అంటూ వ్యాఖ్యానించడంతో చిరంజీవి పైనే ఈయన  ఆగ్రహం వ్యక్తపరిచారని ట్రేడ్ వర్గాల టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: