తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తన అందాలతో అందరి మనసు దోచింది నయనతార.  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘చంద్రముఖి’ చిత్రంలో ఎంతో సాంప్రదాయంగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత గజినీ చిత్రంలో కుర్రకారుకి పిచ్చిలేపింది.  ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా నయన్ కి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది..ఈ అమ్మడు తెలుగు, తమిళ అగ్ర హీరోలందరితో నటించింది.  అంతే కాదు ఎక్కువ హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకుంది.  ఇక నయన్ జీవితంలో ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి..ఈ అమ్మడి లవ్ మ్యాటర్ విషయానికి వస్తే..మొదట శింబు తర్వాత దర్శకుడు, కొరియోగ్రాఫర్  ప్రభుదేవ ఆ తర్వాత ప్రముఖ దర్శకుడితో ఎఫైర్ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  
nayanathara
ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో సోషల్ మీడియాలో నయన్ పేరు మారుమోగుతూనే ఉంటుంది.  తాజాగా ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచింది.   సాధారణంగా సినీ పరిశ్రమలో నటీనటులకు దర్శకులు కండిషన్లు పెడుతుంటారు. అయితే అగ్రతారల విషయంలో మాత్రం దర్శకులే కండిషన్లకు అంగీకరించాల్సిన పరిస్ధితి. తాజాగా దక్షిణాది టాప్‌ హీరోయిన్ నయనతార కొత్త కొత్త కండిషన్లతో దర్శకుల్ని బెంబేలెత్తిస్తోందట. కథ, సీన్, బై సీన్ చెప్పడమే కాకుండా, ప్రధాన సన్నివేశాల్లో డైలాగులు కూడా చెప్పాలని ఇప్పటికే నయన్ కండిషన్ పెట్టింది.ముఖ్యంగా విక్రమ్‌కు జంటగా నటించిన ఇరుముగన్  చిత్రం తరువాత ఈ అమ్మడి దృక్పథంలో చాలా మార్పు వచ్చిందట.
Related image
ఇటీవల లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లో అధికంగా నటిస్తున్న నయనతార కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.దర్శకులు చెప్పే కథలను సీన్  బై సీన్  వింటున్నారట. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే నటించడానికి పచ్చజెండా ఊపుతున్నారు. అంతే కాదు కథల్లో మార్పులు, చేర్పులు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారని సమాచారం.
Related image
ముఖ్యంగా ఇంతకు ముందు ఎలాబడితే అలా విచ్చలవిడిగా అందాలను ఆరబోసిన నయనతార ఇప్పుడు దర్శక నిర్మాతలకు మూడు నిబంధనలు విధిస్తున్నారు. అవేమిటంటే లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించను, ఈత దుస్తులు ధరించినటించను. గ్లామరస్‌గా కనిపించను లాంటి నిబంధనలను విధిస్తున్నారట. అయినా కూడా దర్శక నిర్మాతలు ఈ అమ్మడు చుట్టు తిరగడం విశేషం. ప్రస్తుతం, చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారీ కేరళ భామ.

Image result for nayanthara Liplock



మరింత సమాచారం తెలుసుకోండి: