ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో రెండు కొదమ సింహాలు ఒకేసారి తలబడ్డాయని చెప్పాలి.  దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్  150’ చిత్రంతో అభిమానుల ముందుకు రాగా నందమూరి నట సింహం బాలకృష్ణ తన 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ తో అభిమానుల ముందుకు వచ్చారు.  ఇండస్ట్రీలో ఇద్దరూ పెద్ద హీరోలు కావడం ఆయా సినిమాలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించడం జరిగింది.  ఈ నెల 11న రిలీజ్ అయిన ‘ఖైదీ నెంబర్ 150’ అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ రాగా..మరుసటి రోజు రిలీజ్ అయిన ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ చిత్రం కూడా రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.


            Gautamiputra Satakarni Six Days Collections

అంతే కాదు ఈ రెండు చిత్రాలు ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపుతున్నాయి. తెలుగు వారి రోషం, మీసం మెలేస్తూ ప్రపంచంలో తెలుగు వారి ఖ్యాతి దశదిశలా చాటి చెప్పిన గోప్ప యోధులు గౌతమి పుత్ర శాతకర్ణీ చిత్రంతో నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులు కిన్నులైపోయారు.  బాలయ్య సరసన శ్రియా శరన్ నటించగా తల్లిగా హేమమాలిని నటించింది . రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 13 కోట్ల కు పైగా షేర్ సాధించి భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతోంది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 91 . 35 కోట్లు వసూలు చేసి నందమూరి హీరోల దమ్ము చూపించింది. ఈ రోజుతో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ వందకోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. సో వందో చిత్రం వంద కోట్ల పండుగను చేసుకొనేందుకు నందమూరి అభిమానులు రెడీ గా ఉన్నారు. అంతే కాదు ఓవర్సీస్ లో ఆరో రోజుకు 1.35 మిలియన్ మార్క్ దాటింది. ఇది బాలకృష్ణకు మొదటి సారి దక్కిన రికార్డు కావడం విశేషం.  ఈ వీక్ ఎండ్ కి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

Image result for gautamiputra satakarni photos

సంక్రాంతి బరిలో దిగిన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’, బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణీ’ రెండూ పోటా పోటీగా తలపడుతున్నాయి.  మాస్ ఎంట్రటైన్ మెంట్, మెసేజ్ ఓరియెంటెడ్ తో చిరంజీవి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటి చెప్పిన మహా యోధుడు చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణీ చారిత్రను చాటి చెప్పిన చిత్రంగా బాలయ్య ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రెండు అద్భుత విజయాలు సాధించి మంచి కలెక్షన్లతో రన్ అవుతున్నాయి.  

ఏరియా వైజ్ గా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ కలెక్షన్లు :


నైజాం- 7.3 కోట్లు

సీడెడ్- 6.4

ఉత్తరాంధ్ర- 3.95

ఈస్ట్- వెస్ట్- 6.04

కృష్ణ-2.57

గుంటూరు-3.65

నెల్లూరు- 1.58

కర్ణాటక-3.5

రెస్టాఫ్ ఇండియా- 2 కోట్లు

ఓవర్సీస్- 5.6 కోట్లు.      

Nizam
Ceeded
Uttarandhra
East2.91 Crore
West2.95 Crore
Krishna
Guntur
Nellore1.52 Crore
AP+Nizam
 
Nizam
Ceeded
Uttarandhra
East2.91 Crore
West2.95 Crore
Krishna
Guntur
Nellore1.52 Crore
AP+Nizam
 

మరింత సమాచారం తెలుసుకోండి: