సూపర్ స్టార్ మహేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఫైటింగ్ కు సిద్ధమయినట్టు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం మురుగదాస్ డైరక్షన్లో సినిమా చేస్తుండగా ఆ సినిమా పూర్తి కాగానే కొరటాల శివ డైరక్షన్లో మూవీ షురూ చేశాడు. అయితే ఈ సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఆగష్టు కల్లా పూర్తి చేయాలని ప్లాన్. ఇక అదే క్రమంలో లాస్ట్ ఇయర్ జంతా గ్యారేజ్ హిట్ మళ్లీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న తారక్ బాబి డైరక్షన్లో మూవీ చేస్తున్నాడు. 


బాబి తారక్ సినిమా కూడా ఆగష్టు కల్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఆగష్టు అనుకున్నది ఒక నెల అటుఇటైనా సరే ఈసారి దసరా బరిలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సూపర్ స్టార్ మహేష్ ఫైట్ షురూ అయినట్టే అని తెలుస్తుంది. గ్యారేజ్ హిట్ తో జోష్ లో ఉన్న తారక్.. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో అప్పటికల్లా మురుగదాస్ సినిమా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ సినిమాల ఫలితంతో మహేష్ కూడా కసితో కొరటాల శివ సినిమా చేస్తాడు.


ఈ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాది ఒకేసారి వస్తే సంక్రాంతికి మెగా నందమూరి వార్ లానే.. నందమూరి ఘట్టమనేని వార్ జరుగుతుంది. కెరియర్ లో ఎవరికి వారు తమ స్టామినా ప్రూవ్ చేసుకుంటూ మంచి క్రేజ్ సంపాదించిన మహేష్, తారక్ లు ఎవరికి వారే బీభత్సం సృష్టించే సత్తా ఉన్నవారే. మరి ఈ సినిమాల ఫలితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే ఈ ఏడాది దసరా దాకా వెయిట్ చేయాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: