మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత నటించిన ఖైది నంబర్ 150 మూవీ కలక్షన్స్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. మెగా మేనియాతో సంక్రాంతి స్ట్రాంగ్ కలక్షన్స్ తో వసూళ హవా కొనసాగించిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైది నంబర్ 150 మూవీ సరిగ్గా వారానికి 108.48 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రాబట్టిందని అధికారికంగా ఎనౌన్స్ చేశారు అల్లు అరవింద్.


వినాయక్ డైరక్షన్లో తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా వచ్చిన ఈ ఖైది నంబర్ 150 మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి పండుగను రెండు రోజుల ముందే తెచ్చింది. మెగాస్టార్ పదేళ్ల తర్వాత నటించిన సినిమానే కాదు బాక్సాఫీస్ మెగా మోత మోగించే సినిమాగా వచ్చిన ఈ ఖైది మొదటి షో నుండి భారీ కలక్షన్స్ రాబట్టింది. ప్రీ రిలీజ్ లో అదరగొట్టడమే కాదు ఆ రేంజ్ కలక్షన్స్ తో కూడా మెగా మేనియా కొనసాగుతుంది.


తెలుగు రెండు రాష్ట్రాలలోనే దాదాపు 73 కోట్ల కలక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. ఇక మిగతా 36 కోట్లు ఇతర ప్రాతాల నుండి వచ్చాయట. కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేసిన ఈ కలక్షన్స్ మెగాస్టార్ స్టామినా ఏంటో నిరూపిస్తున్నాయి. తెలుగు సినిమా బాక్సాఫీస్ రారాజుగా మెగాస్టార్ పదేళ్ల తర్వాత ఈ ప్రభంజనం సృష్టించాడు. మరి ఫుల్ రన్ లో మెగా మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: