‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదల తరువాత బాలకృష్ణ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో లీకులను బట్టి కృష్ణవంశీ డైరెక్షన్ లో తాను చేయాలి అనుకున్న ‘రైతు’ ఇక శాస్వితంగా అటక ఎక్కినట్లే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  బాలకృష్ణ ఈసినిమాకు సంబంధించి ఒక ప్రత్యేక పాత్రలో నటించవలసిన అమితాబ్ బచన్ అంగీకారం కోసం ఈసినిమా వాయిదా పడింది అని పైకి చెపుతూ ఉన్నా అసలు కారణాలు వేరు అన్న మాటలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి కృష్ణవంశీ చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడంతో బాలకృష్ణ ఈ మూవీని చేద్దామనుకున్నాడు బాలయ్య.  ఇప్పుడు ‘ఖైదీ’ సాధించిన సూపర్ సక్సస్ తరువాత అటువంటి రైతుల కోసం పోరాడే పాత్రలో తాను నటిస్తే తాను చిరంజీవి ‘ఖైదీ’ మూవీని కాపి చేసినట్లుగా కామెంట్స్ వస్తాయని అందువల్లనే ‘రైతు’ ను అటక ఎక్కించడం మంచిది అన్న అభిప్రాయానికి బాలయ్య వచ్చినట్లు టాక్.

దీనికితోడు ఈమూవీలో బాలయ్య 60 సంవత్సరాలకు పై బడిన వృద్దుడిగా కనిపించవలసిన నేపధ్యంలో అటువంటి పాత్రలో తాను నటిస్తే మరింత ప్రయోగాలు చేసినట్లు అవుతుందని బాలకృష్ణ వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు టాక్.  దీనికితోడు ‘శాతకర్ణి’ విజయంతో వచ్చిన మంచి పేరును పోగొట్టుకునే విధంగా ప్రమోగాలు చేయవద్దని బాలయ్యకు అతడి సన్నిహితులు సూచనలు ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఏది ఎలా చూసుకున్నా అమితాబ్‌ నటిస్తేనే రైతు చేస్తానంటూ బాలకృష్ణ పదేపదే చెబుతున్న మాటలు వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉంది అని అంటున్నారు.  ప్రస్తుతం టాప్ హీరోల పిలుపుకు నోచుకోని కృష్ణవంశీకి అనుకోకుండా వచ్చిన బాలయ్య ద్వారా వచ్చిన అదృష్టాన్ని పోగొట్టడంలో ‘ఖైదీ’ పెను ప్రభావమే చూపించింది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: