మన స్వీటీ వివాహం పై ఎన్నీ కథలు. పుకార్లు. కొన్నిసార్లు పెళ్ళైనట్లు వార్తలు. లేదు అబద్ధం అంటూ సంజాయిషీలు. ఎందుకంటే ఆమె మీద యువతకున్న క్రేజ్. "ఇన్-ఫాత్యుయేషన్" ఈ బంగారు బొమ్మ ఎవడి సొంతమైపోతొందో అనే ఒక రకమైన ఆతృత.

Related image
ఐతే గతములో రెండు సార్లు తప్పిపోయిన పెళ్ళి కొడుకుతోనే మన జేజెమ్మ పెళ్ళిపీటలు ఎక్కబోతుంది. తాళి కట్టించుకుందని తెలుస్తుంది. యువత గుండెల్లో పిడుగులు పడుతున్నాయికదా! సారీ ఈ సారి కూడా వార్తలు నిజం కాదండి.  అయినా స్వీటి మనకు మాటయిచ్చింది కదా! మనకు చెప్పే పెళ్ళి చెసుకుంటానని. మరి పుకార్లు నమ్మకండి అసలు కథేమంటే:   
  
జేజమ్మ!  అనుష్క ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కింది. తను కోరుకున్న వరుణ్ని పెళ్లి చేసుకుంది. అయితే ఇదంతా రియల్‌ లైఫ్‌ లో కాదు.. రీల్‌ లైఫ్‌లో.  సూర్య, అనుష్క హీరో హీరోయిన్లుగా నటించిన ‘సింగం-3’ త్వరలో విడుదల వబోతోంది.

Image result for sinam -3 hD anuska images

ఇదంతా సింగం సీరిస్ సినిమాల్లో కథ.  తొలి రెండు సినిమాల్లోనూ సూర్యకు అనుష్క ప్రియురాలిగా నటించింది. పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి అనుకున్న ప్రతీ సందర్భం లోనూ వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతో తొలి రెండు భాగాల్లోనూ సూర్య, అనుష్క లవర్స్‌ గానే కనబడతారు.  కానీ, ఈ మూడో భాగంలో మాత్రం సూర్యకు భార్యగా కనిపిస్తుందట స్వీటీ.


ఈ సినిమాలో మరో హీరోయిన్‌ శృతీహాసన్‌. ఇందులో శృతీది గ్లామరస్‌ పాత్రే అయినప్పటకీ ఆమెకు యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉంటాయట. అయితే ఈ సినిమాలో ఇద్దరు భామలూ పోటీ పడి మరీ గ్లామర్‌ విందు చేశారట. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది


Related image

మరింత సమాచారం తెలుసుకోండి: