సినిమాలు అంటే పది మందికి విజ్ఞానం పెంచాలి..మంచి మేజేజ్ ఉండాలి. ఇవి కాకపోతే మాస్ ఎంట్రలైన్ మెంట్ ఉండాలి. కానీ ఈ మద్య సినిమాలంటే లేనిది ఉన్నట్లుగా..ఉన్నది లేనట్లుగా చూపిస్తూ..జనాల మనోభావాలతో ఆడుకుంటున్నారు.  సినిమాల్లో అడల్ట్ కాంటెంట్ పెట్టడం..అల్లిబిల్లిగా కథలు అల్లడం సినిమా ఎదో మమా అనిపించడం కామన్ అయ్యింది.  కొంతమంది దర్శక, నిర్మాతలు దేవుళ్లపై కూడా ప్రయోగాలు చేస్తూ జనాలతో చివాట్లు తింటున్నారు.  తాజాగా ద్యావుడా సినిమా ట్రైలర్ లో హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే మహాశివలింగానికి సిగరెట్లు, మందు, మాంసంతో అభిషేకం చేసి కోట్ల మంది మనోభావాలు దెబ్బతీశారు.  
Image result for Dyavuda stills
అంతే కాదు ఎంతో భక్తిగా కొలిచే వెంకటేశ్వరస్వామిని కూడా కించపరిచే సన్నివేశాలు ట్రైలర్ లో చూపించారు.  కాగా యు ట్యూబ్ లో పెట్టిన ట్రైలర్ ప్రకంపనలు సృష్టించడంతో పెద్ద ఎత్తున హిందూ ధర్మం ని ఆచరించే వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు.   నూతన సంవత్సరం మొదటి రోజున యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా టీజర్‌ తీవ్ర అలజడి సృష్టించింది.
Related image
అందులో హిందువుల ఆరాధ్య దైవమైన శివుడిపై అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. సాయిరామ్, హరికుమార్‌ రెడ్డిలపై బజరంగ్‌దళ్‌కు చెందిన యు.నవీన్‌ నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 4న ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు చిత్ర దర్శకుడు సాయిరాంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత హరికుమార్‌రెడ్డి ప‌రార‌య్యాడు. దీంతో పోలీసులు ఆయ‌న కోసం గాలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: