‘ఖైదీ నెంబర్.150’ కాసుల వర్షం కురిపిస్తోంది.  సంక్రాంతి సీజన్ లో విడుదల రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఈ నెల 11న విడుదలైన ఖైదీ మూవీ వారం రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని సినీ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఫస్ట్ వీక్ టోటల్ గ్రాస్ కలెక్షన్లు 108.48 కోట్లు సాధించిందని.. ఏడు రోజులకుగానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.76.15 కోట్లు రాబట్టిందని చెప్పారు అల్లు అరవింద్.  వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు చిరు తనయుడు రాంచరణ్ నిర్మాతగా ఉన్నారు.  

Image result for khaidi no 150

కత్తి మూవీని రీమేక్ చేయడంపై కొంతమంది క్రిటిక్స్ విమర్శించినప్పటికీ... బీ, సీ సెంటర్లలో సినిమా బాగా పర్‌ఫామ్ చేయడంతో బాహుబలి కాకుండా ఇతర చిత్రాల పేరిట వున్న కొన్ని రికార్డులని 'ఖైదీ నెంబర్ 150' చిత్రం తన సొంతం చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చేసిన సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అభిమానులను మెప్పించిన మెగాస్టార్ రీ ఎంట్రీలో బాస్ ఈజ్ బ్యాక్ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగా మూవీ ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్నారు.  బాస్ ఈజ్ బ్యాక్‌..బాక్సాఫీస్ షేక్‌. ఇది ఖైదీ తొలి రోజు రికార్డుల ప‌రంప‌ర‌ కొనసాగించింది.

Image result for khaidi no 150

150 సినిమాగా తెలియ‌డానికి వీలుగా ఖైదీ నెంబ‌ర్ 150గా నామ‌క‌ర‌ణం చేశారు. మ‌రోవైపు రీ ఎంట్రీ అర్థం మూవీ టైటిల్ ట్యాగ్ లైన్‌లోనూ స్ఫురించేలా బాస్ ఈజ్ బ్యాక్ అని పెట్టారు. పాట‌ల్లోనూ బాస్ వ‌స్తున్నాడంటూ హింట్ ఇచ్చారు. బీ, సీ సెంటర్లలో సినిమా బాగా పర్‌ఫామ్ చేయడంతో బాహుబలి కాకుండా ఇతర చిత్రాల పేరిట వున్న కొన్ని రికార్డులని 'ఖైదీ నెంబర్ 150' చిత్రం తన సొంతం చేసుకుంది.  చిరంజీవి రీఎంట్రీని ప్రజలు, అభిమానులు ఆదరించినందుకు ప్రొడక్షన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు అరవింద్. త్వరలోనే కృతజ్ఞత సభ నిర్వహిస్తామని తెలిపారాయన.

Image result for khaidi no 150

ఏరియా వైజ్ ‘ఖైదీ నెంబర్ 150 ’ కలెక్షన్లు :


నైజాం : 14.50


సీడెడ్ : 10.86


నెల్లూరు : 2.42


కృష్ణా : 4.13


గుంటూరు :5.51


ఈస్ట్ గోదావరి : 6.34


వెస్ట్ గోదావరి : 4.87


ఉత్తరాంధ్ర : 8.40


ఏపీ + తెలంగాణ కలెక్షన్లు : 57.03 కోట్లు


ఓవర్సీస్ : 12.75


కర్ణాటక : 7.47


రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.40 


మరింత సమాచారం తెలుసుకోండి: