ఒక రీమేక్ ను నమ్ముకుని పవన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కాటమరాయుడు’ పై ఇప్పటికే పవన్ అభిమానులలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి.  ఇప్పుడు ఈ అనుమానాలకు తోడు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పై వస్తున్న వార్తలు పవన్ అభిమానులను విపరీతంగా టార్చర్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఆశక్తి కలిగిస్తున్న ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘కాటమరాయుడు’ సినిమాకు సంబంధించి అనూప్ వ్యవహరిస్తున్న తీరు పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం రుచించడం లేదు అని టాక్.  తెలుస్తున్న సమాచారం మేరకు అనూప్ ఈసినిమాకు సంబంధించిన పాటల విషయంలో సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఈమూవీ పాటల రికార్డింగ్ బాగా ఆలస్యం అవుతోందని అంతేకాకుండా అనూప్ కంపోజ్ చేసిన ట్యూన్స్ కూడ పెద్దగా క్యాచీగా లేవు అని పవన్ తన సన్నిహితుల వద్ద కామెంట్ చేసినట్లు టాక్.

దీనికితోడు అనూప్ ఈసినిమాకు సంబంధించి ఒకొక్క పాట ట్యూన్ ను కంపోజ్ చేయడానికి నెలలకు తరబడి సమయం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఇప్పటికే ఈసినిమా చిత్రీకరణ ఆలస్యంగా జరుగుతున్న నేపధ్యంలో అనూప్ ఆలస్యం ఈ సినిమా విడుదల పై విపరీతమైన ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉందని పవన్ భావిస్తున్నట్లు టాక్. 

ప్రస్తుతం అనూప్ 8 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే బిజీలో ఉండటంతో పవన్ సినిమా పట్ల అనూప్ సరైన శ్రద్ధ కనిపించడం లేదు అన్న వార్తలు కూడ ఉన్నాయి.  దీనితో పవన్ ఏరికోరి ఎంచుకున్న అనూప్ ‘కాటమరాయుడు’ పట్ల ఇలా ప్రవర్తించడం ఏమిటి అని పవన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. టాప్ హీరోల సినిమాల విజయానికి పాటల సక్సస్ కీలకం కావడంతో అనూప్ వ్యవహారశైలి ‘కాటమరాయుడు’ ఫలితం పై ఎలాంటి ప్రభావాన్ని చూపెడుతుందో అన్న భయంలో అభిమానులు ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: