chiranjeevi life's best images కోసం చిత్ర ఫలితం

ఫుల్‌ రన్‌లో ఎనభై కోట్ల మార్కు దాటిన చిత్రాలు చరిత్రలో రెండే ఉన్నాయి. మొదటిది బాహుబలి కాగా, రెండవది శ్రీమంతుడు. 70 కోట్ల వసూళ్లు దాటిన చిత్రాలు చరణ్‌, పవన్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌కి ఒక్కోటి ఉన్నాయి కానీ ఎనభై కోట్ల స్పెషల్‌ క్లబ్‌లో రెండు మాత్రమే నిలిచాయి.


పదేళ్ల తర్వాత పరిశ్రమలో తిరిగి అడుగుపెట్టిన చిరంజీవి సరాసరి "ఎనభై కోట్ల క్లబ్‌" లోనే అడుగు పెట్టి తన స్థాయి ఏంటనేది? చూపెడుతున్నారు.


chiranjeevi life's best images కోసం చిత్ర ఫలితం

 కేవలం ఎనిమిది రోజుల్లో ఎనభై కోట్ల షేర్‌ వసూలు చేసిన ఖైదీతో  'శ్రీమంతుడు' రికార్డుకి మూడింది. రేపటిలోగా ఈ రికార్డు గల్లంతవడం ఖాయమని తేలిపోయింది. "బాహుబలి రికార్డులని బ్రేక్‌ చేయడం కష్టమే"  కానీ, "శ్రీమంతుడు రికార్డుని బ్రేక్‌ చేసి"  మన యువ హీరోలందరికీ చిరు "కొత్త టార్గెట్‌"  సెట్‌ చేయబోతున్నారు. తొమ్మిదవ రోజున కూడా హౌస్‌ఫుల్స్‌ నమోదవుతూ ఉండడంతో ఖైదీ రచ్చ ఇప్పట్లో ఆగేట్టు లేదనేది క్లియర్‌గా తెలుస్తోంది. కనీసం మరో పది రోజుల పాటు అయినా షేర్స్‌ మీద నడుస్తుంది కనుక వంద కోట్ల కంటే ఎక్కువ షేర్‌ రావడం తథ్యమని ట్రేడ్‌ వర్గాలంటున్నాయి. 

chiranjeevi life's best images కోసం చిత్ర ఫలితం

యాభై కోట్ల షేర్‌ అయినా సాధించి పరువు నిలబెట్టుకుంటారా?  అంటూ చిరంజీవి స్టామినాని అనుమానించిన వాళ్లు ఈ ప్రభంజనాన్ని చూసి మాట పెగలక సైలెంట్‌ అయిపోయారు. రాజకీయాల్లో తనని అణచివేయడం ఈజీనే కానీ సినీ రంగంలో అన్నిటికీ అతీతుడనని, ఇది తన రాజ్యమని చిరంజీవి నిరూపించారు.

chiranjeevi life's best images కోసం చిత్ర ఫలితం 

మరింత సమాచారం తెలుసుకోండి: