తమిళ ప్రజల ప్రాంతీయ అభిమానం ముందు తెలుగుజాతి ఆత్మాభిమానం కోసం పోరాటం చేస్తాము అని గొప్పలు చెప్పుకునే మన నాయకుల హీరోల మాటలు కేవలం మాటలకు మాత్రమే పరిమితమౌతూ ఉంటాయి అన్న సందర్భం మరొకసారి ఉదాహరణ పూర్వకంగా మన కళ్ళముందు కనపడుతోంది.
 ‘జల్లికట్టు’ పై నిషేధం ఎత్తివేయమని 'పెటా'ని బ్యాన్‌ చేయమని నినాదాలు ఇస్తూ చెన్నై మెరీనా బీచ్ లో నినాదాలు చేస్తున్న లక్షలాది తమిళ సోదరులకు మానసికంగా మద్దతు పలుకుతూ ‘మేమున్నాం’ అంటూ పవన్ మహేష్ లు ‘జల్లికట్టు’ నిషేధాన్ని తొలిగించమని కోరుతూ ట్విట్ చేసాడు. 

అయితే ఇక్కడే కొన్ని ఆశ్చర్యకర విషయాలు ఎవరికీ అర్ధం కానివి కనిపిస్తున్నాయి.  తెలుగు ప్రజలను నిట్టనిలువుగా రెండు రాష్ట్రాలుగా చీల్చివేసినప్పుడు అప్పుడు ఆరోజులలో లేచిన ఉవ్వెత్తు ప్రజా ఉద్యమానికి మాట సహాయం కూడ చేయని పవన్ మహేష్ లు ఇప్పుడు పక్క రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా ఉద్యమానికి సంఘీభావం తెలపడం చాలామందికి ఆశ్చర్య పరిచే విషయమే. 

ఆ తరువాత తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం ప్రజలు రోడ్డు ఎక్కితే అప్పుడు కూడ ప్రిన్స్ మహేష్ బాబు స్పందించ లేదు.  అయితే పవన్ మాత్రం తన వీలు చూసుకుని తన ‘జనసేన’ అవసరాల దృష్ట్యా ఈవిషయమై చాల ఆలస్యంగా స్పందించాడు. 
అయితే ఇటువంటి పవన్ మహేష్ లు తమిళ ప్రజల ఆత్మాభిమానంతో ముడి పెట్టబడుతున్న ‘జల్లికట్టు’ సమస్య పై వెంటనే స్పందించి తమ సామాజిక స్పృహను చాటుకున్నారు.

ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఈవిషయమై పవన్ చేసిన ట్విట్ కొందరికి షాక్ ఇస్తోంద ‘ప్రభుత్వం జంతువులను హింసిస్తున్నారన్న కారణంతో జల్లికట్టును నిషేధించింది. నిజంగా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉంటే దేశ వ్యాప్తంగా జరుగుతున్న పౌల్ట్రీ బిజినెస్.. బీఫ్ ఎగుమతుల మీద చర్యలు తీసుకోవాలి’ అంటూ ట్వీట్ చేశాడు పవన్.  

అంతేకాదు తన ఫాంహౌస్ లో ఉన్న 16కు పైగా ఆవులు - కోడిపుంజులు దక్షిణ భారతంలోనిజల్లికట్టు కోడిపందేలపై విధించిన నిషేధం గురించి తెలుసుకున్న తరువాత తనను ఆలోచించేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించాడు పవన్. అయితే పవన్ ట్విట్స్ చూసినవారు మాత్రం ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కు అయోమయమేనా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: