ఇప్పుడు భారత దేశంలో హాట్ టాప్ గా మారింది తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టు.  తమిళనాడు ఎన్నో సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్న జల్లికట్టు క్రీడను నిషేదిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తమిళనాడు ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ వర్గాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఈ విషయంపై చర్చించాలని కోరగా ఆయన కూడా ఏమీ చేయలేనని చేతులు ఎత్తారు.
Image result for jallikattu
మరోవైపు  తమ సంప్రదాయక క్రీడ అయిన జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ చెన్నై లోని మెరీనా బీచ్ లో సామాన్య ప్రజలతోబాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.   ఇక తమిళ సినిమా పరిశ్రమ యావత్తు జల్లికట్టు కు అనుకూలంగా వ్యవహరిస్తోంది . ఇప్పటికే పలువురు నటీనటులు , సాంకేతిక నిపుణులు జల్లికట్టు కోసం ఉద్యమంలో పాల్గొనగా ఈరోజు యావత్ చిత్ర పరిశ్రమ తమతమ షూటింగ్ లన్నీ బంద్ చేసుకొని మరీ మద్దతు తెలపడానికి ముందుకు వచ్చాయి .
Image result for jallikattu
తాజాగా ఈ విషయంలో తమిళుల ఐకమత్యం సంతొషించదగినదని, జల్లికట్టు పట్ల అభ్యంతరం ఎందుకో తనకు తెలియడంలేదని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. దీనిపై టాలీవుడ్ లో మొట్టమొదటి సారిగా ఈ సూపర్ స్టార్ స్పందించడం విశేషం.

మహేష్ బాబు ట్విట్స్ :

మరింత సమాచారం తెలుసుకోండి: