తెలుగు ఇండస్ట్రీలో మహానటులుగా తెలుగు కళామతల్లికి రెండు కళ్లుగా నిలిచిన వారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్.  ఈ ఇద్దరు మహానటులు పోషించిన పాత్రలు తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత కాలం గుర్తుండి పోయాలా ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.  ఇక నాగేశ్వరరావు దేవదాసు చిత్రం ఎన్న తరాలైనా మర్చిపోలేం..భగ్నప్రేమికుడిగా ఆయన నటన అనిర్వచనీయం.

 ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించిన ఏఎన్ఆర్ తాగు బోతు, భగ్న ప్రేమికుడు, రొమాంటిక్  పాత్రలకు స్పెషల్ అని చెప్పొచ్చు.  వరి చేలలోనుండి, నాటకరంగం ద్వారా కళారంగంలోకి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు.  నాగేశ్వరరావు కి తన కుటుంబం అంటే వల్లమాలిన ప్రేమ..తన ధర్మపత్ని మృతి చెందిన తర్వాత ఆమె ప్రతిమను ఏర్పాటు చేయించి ఆమె తీపి జ్ఞాపకాలతో కాలం గడిపిన గొప్ప భర్త.  నాగేశ్వరావు తన కుటుంబ సభ్యులతో తీయించుకున్న అలనాటి అపురూప చిత్రం మీకోసం... 



మరింత సమాచారం తెలుసుకోండి: