నందమూరి బాలకృష్ణ కలల ప్రాజెక్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి సూపర్ సక్సెస్ అవడంతో ఇక నుండి చేసే సినిమాల మీద మరింత జాగ్రత్త తీసుకునే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ. 100వ సినిమా ఎలా ఉండాలనుకున్నాడో అలాంటి సినిమాతోనే వచ్చి హిట్ అందుకోగా ఆ తర్వాత 101వ సినిమా మీద కాస్త కన్ ఫ్యూజన్ ఏర్పడ్డదట. అసలైతే శాతకర్ణి తర్వాత కృష్ణవంశీ డైరక్షన్లో రైతు సినిమా చేయాలని నిర్ణయించుకున్న బాలకృష్ణ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకుంటారని తెలుస్తుంది.


శాతకర్ణి హిట్ తో తన సత్తా చాటిన బాలయ్య రైతు మూవీతో మళ్లీ ట్రాక్ తప్పే అవకాశాలున్నాయని వార్తలు రావడంతో ముందుగా ఆ సినిమా చేయాలని అనుకున్నా అది కాదని ఇప్పుడు వేరే సినిమా చేయాలని అనుకుంటున్నారట. బాలయ్య బాబు వందవ సినిమా రేసులో ఉన్న బోయపాటి శ్రీను, పటాస్ అనీల్ రావిపూడి, పూరి జగన్నాథ్ ఇలా వేరే డైరక్టర్స్ తో 101వ మూవీ ప్లాన్ చేస్తున్నారట బాలకృష్ణ.


అయితే రైతు సినిమా ఆగిపోడానికి అమితాబ్ కూడా ఓ కారణమని అంటున్నారు. రైతు సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ అమితాబ్ కోసం రాసుకున్నారట. అంతేకాదు సినిమాలో నటించాలని అమితాబ్ ను కలిసి మరి అడిగారు కూడా కాని అమితాబ్ మాత్రం సినిమా చేయడం కుదరదని అన్నాడట. అందుకే బాలయ్య రైతు విషయంలో వెనక్కి తగ్గాడని అంటున్నారు. మరి అమితాబ్ పాత్రలో ఎవరినైనా పెట్టి ఆ సినిమా తీస్తారా లేక అసలకే ఆ ప్రాజెక్ట్ అటకెక్కించేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: