టైటిల్ చూసి కచ్చితంగా మన స్వీటి అనుష్కకు సంబందించిన న్యూసే అని మీరు కన్ఫాం అవ్వొచ్చు. అవునండి ఇక్కడ ప్రస్థావించింది సౌత్ సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించే. మరి అనుష్క పెళ్లి మ్యాటర్ అంత ఈజీగా ఎలా చెబుతారు అదో పెద్ద సెన్సేషన్ కదా అంటే అనుష్క పెళ్లి చేసుకుంది కేవలం సినిమాలోనే అట. అవును సూర్యతో కలిసి నటించిన సింగం మూడో సీక్వల్ ఎస్-3లో అనుష్క శెట్టి సూర్యను పెళ్లాడిందట.


సూర్య 1,2 సినిమాల్లో సూర్యకు ప్రియురాలిగా కనిపించిన అనుష్క ఈ మూడో భాగంలో సూర్యను పెళ్లి చేసుకుందట. ఇక మొదటి సినిమాలో కేవలం అనుష్క మాత్రమే సోలో హీరోయిన్ కాగా రెండో సినిమాలో హాన్సిక నటించింది. ఇప్పుడు ఈ మూడో సినిమాలో శృతి హాసన్ మరో హీరోయిన్ గా నటిస్తుంది. అనుష్క హోంలీ క్యారక్టర్ గా కనిపిస్తుండగా శృతి హాసన్ మాత్రం ఈ సినిమాలో ఫైట్స్ కూడా చేసిందని తెలుస్తుంది.


ట్రైలర్ తో అంచనాలను పెంచేసిన సూర్య ఎస్-3 జనవరి 26న రిలీజ్ అవుతుంది. అసలైతే లాస్ట్ ఇయర్ దీవాళికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ధ్రువ టైంలో కూడా చెర్రి సినిమాకు పోటీ ఎందుకని ఎస్-3 పోస్ట్ పోన్ చేసుకున్నాడు. మరి ఇన్నిసార్లు వాయిదా పడ్డ సూర్య ఎస్-3 ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: