ఫిబ్రవరి 3న కనుపాప : 


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించిన మోహన్ లాల్ ఈమధ్యనే మలయాళంలో హిట్ అయిన పులిమురుగన్ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసి హిట్ సాదించారు.


ఇక ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాతో రాబోతున్నారు మోహన్ లాల్. ఒప్పంతో అక్కడ విజయం దక్కించుకున్న సినిమా తెలుగులో కనుపాపగా రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 3న ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.   


ది రైజ్ ఆఫ్ శివగామి రిలీజ్ : 


ప్రముఖ రచయిత నీలకంఠన్ ది రైజ్ ఆఫ్ శివగామి పుస్తకం రాస్తున్నారు. బాహుబలి బిగినింగ్ కన్నా ముందు ఏం జరిగింది అన్న కథ ఇందులో ప్రస్థావిస్తారట.


జయపురలో జరిగిన సాహిత్య వేడుకల్లో ఈ పుస్తకం ముఖ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాహుబలి చిత్రయూనిట్ పాల్గొంది.


వెంకీతో వరుణ్ సినిమా : 


వెంకీ అనగానే విక్టరీ వెంకటేష్ అనుకుని ఉండొచ్చు. కాని ఇక్కడ వెంకీ అన్నది దర్శకుడు వెంకీ అట్లూరి గురించి. వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్లో ఓ సినిమా రాబోతుంది. బివిఎసెన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: