ప్రస్తుతం టాప్ హీరోల మధ్య పోటీ పెరిగి పోవడంతో టాప్ హీరోల అభిమానులు ఆ సినిమా కలెక్షన్స్ గురించి మాత్రమే చాలా సీరియస్ గా  పట్టించు కుంటున్నారు. దీనితో భారీ సినిమాలను తీసిన నిర్మాతలు కూడ తమ సినిమా బ్లాకు బస్టర్ హిట్ అని చాటుకోవడానికి తమ సినిమాల కలెక్షన్ల వివరాలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించవలసిన నేపధ్యం ఏర్పడుతోంది. 

అయితే ప్రస్తుతం దేశంలో నోట్ల రద్దు తరువాత ఆదాయం బాగా ఉన్న వారి పై ఐ టి దృష్టి బాగా పెరిగిపోవడంతో  సంక్రాంతి రేస్ కు వచ్చిన  మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం వసూళ్ళ  వివరాలను ప్రెస్ మీట్ పెట్టి మరీ నిర్మాతలు ప్రకటించడంతో ఈ సినిమాకు పని చేసిన కొందరు  టాప్ కళాకారులు టెక్నిషియన్స్ 'ఖైదీ నెం 150' నిర్మాత వద్ద నుండి ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే వివరాలను తెలుసుకోవడానికి  ఐటీ అధికారులు ప్రశ్నిస్తారనే భయంతో ఉన్నట్లు  వార్తలు వస్తున్నాయి. 

దీనితో ‘ఖైదీ’ కలెక్షన్స్ విషయంలో సృష్టిస్తున్న ప్రకంపనల వల్ల  తమ పై ఐ టిదాడులు జరుగుతాయేమో అన్న భయంతో చాలామంది ‘ఖైదీ’ ఆర్టిస్టులు ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి.  ఈమూవీ తొలి వారం 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన నేపధ్యంలో  ఈ కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటించడంతో  ఈ సినిమాను కొనుకున్న బయ్యర్లకు కూడ ఐ టి భయం పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదలై 10 రోజులు పూర్తి అయినా బాక్సాఫీస్ దగ్గర  చిరంజీవి హవా ఏమాత్రం తగ్గక పోవడంతో ఈ మూవీ రన్ పూర్తి అయ్యేసరికి ‘ఖైదీ’ 125 కోట్ల గ్రస్స్ మార్కును చేరుకున్నా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: