ఈ మద్య చిన్న సినిమాల హవా బాగా కొనసాగుతుంది.  కొత్త దర్శక, నిర్మాతలు కొత్త కాన్సెప్ట్ తో తక్కువ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.  ఇలాంటి చిత్రాలకు కొత్త నటులను ఇంట్రడ్యూస్ చేయడం ఆనవాయితీ అయ్యింది.  సరైన కథాబలం లేకుండా ఏదో సినిమా తీస్తున్నాం అన్న రీతిలో సినిమాలు తీయడం ఫ్యాషన్ అయ్యింది.  రీసెంట్ గా యంగ్ డైరెక్ట‌ర్ సాయిరాం దాసరి తెర‌కెక్కిస్తున్న’ద్యావుడా’ సినిమాపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఈ చిత్రంలో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా చాలా స‌న్నివేశాలున్నాయ‌ని అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. ఇదే స‌మ‌యంలో సినిమా టీజ‌ర్ యూ ట్యూబ్ లో విడుద‌లైంది.
Image result for ippatlo-ramudila-seethala-evaruntarandi-babu
ఇందులో బీరుతో శివలింగానికి అభిషేకం, సిగరెట్‌తో ధూపం వెలిగించ‌డం, వెంకటేశ్వర స్వామి ఫొటోను నేలకేసి కొట్టడం వంటి స‌న్నివేశాలు హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతే కాదు ఈ సినిమా దర్శక,నిర్మాతలపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.  
Image result for ippatlo-ramudila-seethala-evaruntarandi-babu
తాజాగా ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు అనే చిత్రం రిలీజ్ కి సిద్ధమైంది .  ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు విపరీతమైన రోమాన్స్ కూడా కనిపిస్తుంది.  బాలీవుడ్ తరహాలో విపరీతమైన అడల్ట్ కాంటెంట్  పచ్చిబూతు తలపిస్తుంది.  రాముడు సీత ల పేర్లు ఈ బూతు చిత్రానికి వాడటం ఏంటి ?  అని అంటున్నారు నెటిజన్లు.  
Image result for ippatlo-ramudila-seethala-evaruntarandi-babu
శారీరక కోర్కెలు తీర్చుకోవడానికి అడ్డదార్లు తొక్కే సినిమాల ఉంది అందుకే సెన్సార్ వాళ్ళు కూడా టైటిల్ కు తగ్గట్లే '' ఏ '' సర్టిఫికెట్ ఇచ్చారు . అందాల ఆరబోత , శృంగార సన్నివేశాలకు కొదవలేదు అనే రేంజ్ లో కనబడుతోంది. ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యాక ప్రేక్షకులను అలరించడం కష్టమే కానీ వసూళ్లు మాత్రం సాధించవచ్చు .


మరింత సమాచారం తెలుసుకోండి: