మెగాస్టార్ రీ ఎంట్రీతో మెగా స్టామినాతో దుమ్మురేపుతున్న చిరంజీవి తన ఎంట్రీ పదేళ్లవుతున్నా సరే కలక్షన్స్ లో మాత్రం తన రేంజ్ చూపిస్తున్నాడు. పదేళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరం గా ఉన్న చిరు కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే చిరు రాకకోసం అప్పట్లో అమితాబ్ బచ్చన్ కూడా ఎదురుచూశారు. అవకాశం వస్తే చిరంజీవి 150వ సినిమాలో అమితాబ్ కూడా నటిస్తానని అన్నారు.


ఇక ఇదే ఆలోచన చేస్తూ ఖైది నంబర్ 150లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఉంటే ఎలా ఉంటుందని అంచనాలేస్తున్నారు. అదే కనుక జరిగితే ఇప్పుడు సృష్టిస్తున్న రికార్డులు ఇంకాస్త ఎక్కువయ్యే అవకాశం ఉండేది. చిరుని ప్రస్థావిస్తూ చాలా సార్లు తన గురించి మాట్లాడిన అమితాబ్ చిరు రీ ఎంట్రీని సాదరంగా ఆహ్వానించారు. ఇప్పుడు చిరు కలక్షన్స్ అలాంటి వారందరికి సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు.


మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూసిన మెగా ఎంట్రీ అదే రేంజ్లో జరిగింది. ఖైది కలక్షన్స్ ఆ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు మెగాస్టార్ చిరంజీవికే షాక్ తెప్పించాయంటే నమ్మాలి. మెగా ఎంట్రీ తో మోత మోగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్ ఇకనుండి మెగాస్టార్ ప్రతి సినిమాకు ఇదే రచ్చ ఉంటుందని తెలియచేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: