నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా సూపర్ ఫాంలో ఉన్న దిల్ రాజు ఈమధ్య మళ్లీ వరుస సినిమాలను తీస్తున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో హిట్ అందుకున్న దిల్ రాజు ఆ సినిమా రిలీజ్ నేపథ్యంలో పెద్ద సినిమాల నడుమ రిలీజ్ చేసి తన గట్స్ మెచ్చుకునేలా చేశాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు లేనిది యాక్టివ్ గా పాల్గొన్న దిల్ రాజు సినిమా మీద తనకున్న కమిట్మెంట్ గురించి అందరు షాక్ అయ్యేలా మాట్లాడాడు.


తనకు నచ్చకుండా తన నిర్మాణంలో ఎలాంటి సినిమా చేయనంటున్న దిల్ రాజు.. దర్శకుడి సృజనకు తను ప్రాముఖ్యత ఇస్తానని.. అయితే తనకు ఏదైతే చెప్పి ఒప్పించాడో అవుట్ పుట్ అలా రాకపోతే మాత్రం తప్పకుండా అడ్డుకుంటానని అన్నారు. ఆ క్రమంలోనే ఈమధ్యనే తన ప్రొడక్షన్లో ఓ సినిమా 35 రోజులు షూటింగ్ చేసి మరి ఓ సినిమా ఆగిపోయిందని షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు దిల్ రాజు. ఇప్పుడు దిల్ రాజు ఆపేసిన సినిమా ఏంటా అని చర్చించుకుంటున్నారు.


సో దర్శకుడి ఆలోచనకు సహకారం అందిస్తూనే తను పెట్టే పైసలకు తగిన సెఫ్టీ చూసుకుంటున్నాడు దిల్ రాజు. శతమానం భవతి హిట్ ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు ఇక వచ్చే నెలలో నాని నేను లోకల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. కుదిరితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తా అంటున్న దిల్ రాజు ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నాడని మాత్రం కనబడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: