తమిళనాట సినీ హీరోలంతా జల్లికట్టుకు మద్దతుగా మాట్లాడుతున్న వేళ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆయన జల్లికట్టుపై వరుస ట్వీట్లు చేశారు. అయితే సినీ పరిశ్రమ అంతా ఒక్క తాటి పైకి వచ్చి జల్లికట్టుకు మద్దతు తెలుపుతుంటే వర్మ మాత్రం జల్లికట్టు కోసం నిరసన తెలుపుతున్న ఆందోళన కారులపై నిప్పులు చెరిగాడు. ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలకు దిగాడు.  సినిమాల్లో కాకులు, కుక్కలను చూపించడం కూడా నేరమని... అలాంటిది సంప్రదాయం పేరుతో ఎద్దులను రాక్షసంగా హింసించడాన్ని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుందని వర్మ ప్రశ్నించారు.


వాళ్లు రక్తం మరిగిన రాబందులు : వర్మ

ఒక్క జంతువు వెంట వేలాదిగా పరిగెడుతూ ఉంటే దానికి ఎలా ఉంటుందో తెలియాలంటే.. జల్లికట్టును సమర్థించే ఒక్కొక్కరి వెనకాల వంద ఎద్దులను వదలాలని, అప్పుడు కానీ వారికి ఆ బాధ అర్థం కాదని వర్మ ట్వీట్‌ చేశారు. జల్లికట్టు సమయంలో ఆ ఎద్దుల కొమ్ములు, చెవులు, తోక విరిగిపోతాయని... ముక్కుకు కట్టిన తాడు వల్ల విపరీతమైన బాధను అనుభవించి మరణిస్తాయని... ఇది అనాగరికమని అన్నారు. అమాయక జీవులను హింసిస్తూ దానికి సంప్రదాయం అనే ముసుగు వేయడం దారుణమని తెలిపారు. 


వాళ్లు రక్తం మరిగిన రాబందులు : వర్మ

రక్షణ లేని జంతువులను సాంప్రదాయం పేరుతో ఆనందం కోసం హింసించటం టెర్రరిజం కన్నా ఘోరం. అలా ఒక మూగజీవాన్ని వేటాడం కన్నా ఓ మనిషి ఎందుకు వేటాడరు. జల్లికట్టుకోసం పోరాడుతున్న వారికి కనీసం సాంప్రదాయానికి స్పెల్లింగ్ కూడా తెలీదు. వారంతా రక్తం మరిగిన మానవ రూపంలో ఉన్న రాబందులు. ఆ జంతువులకు ఓటు హక్కు ఉండి ఉంటే ఒక్క రాజకీయ నేత కూడా జల్లికట్టుకు సపోర్ట్ చేసేవాడు కాదు'. అంటూ విమర్శించాడు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: