సంక్రాంతికి విడుదల అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అమెరికాలో అడుగుపెట్టిననందమూరి సింహం బాలకృష్ణకు ఘన స్వాగతం లభించింది.  ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టీంతో కలిసి శుక్రవారం అమెరికాలో అడుగుపెట్టిన బాలయ్యకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. 

డల్లాస్ ఎయిర్ పోర్టులో బాలయ్యకు స్వాగతం పలకడానికి వందలాది అభిమానులు  వచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి బయటికి రాగానే బాలయ్య కోసం బస్సు లాంటి భారీ లగ్జరీ కారు సిద్ధం చేసి అభిమానులు ఏకంగా బాలకృష్ణ కే షాక్ ఇచ్చారు.  ఆ కారులో ఎక్కి  బాలయ్య  అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే వెనుక 40 - 50 కార్లు.. బైకులు కాన్వాయ్ గా సాగాయి.  

దీనితో ఓవర్సీస్  కలెక్షన్స్ లో ‘శాతకర్ణి’ ‘ఖైదీ’ కన్నా వెనుకపడినా అమెరికాలోని  అభిమానుల ఫాలోయింగ్ లో తనకు ఎదురులేదు అని బాలకృష్ణ మరోసారి రుజువు చేసుకున్నట్లు అయింది. ఇది ఇలా ఉండగా శాతకర్ణి వలన బాలకృష్ణకు ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా బాలయ్య అభిమానులు మాత్రం క్రిష్ పై ఇంకా అసంతృప్తిగా ఉన్నట్లుగానే వార్తలు వస్తున్నాయి.

తక్కువ బడ్జెట్ లో భారీ లుక్ వచ్చేలా శాతకర్ణి ని నిర్మించి అందరి ప్రసంసలు పొందిన క్రిష్ ఈసినిమాను ధైర్యం చేసి ‘ఖైదీ’ తో పోటీగా 11న విడుదల చేసి ఉంటే ‘ఖైదీ’ కి ఈవిధమైన సోలో వసూళ్లు దక్కేవి కావని నందమూరి అభిమానుల అభిప్రాయం. క్రిష్ కు మెగా క్యాంప్ తో ఉన్న మొహమాటాల వల్లనో లేదా మరే కారణాల వల్లనో క్రిష్ చివరి నిముషంలో ‘శాతకర్ణి’ కి అన్యాయం చేసాడు అన్న అభిప్రాయం ఇప్పటికి కూడ నందమూరి అభిమానులలో కొనసాగుతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: