మెగా స్టార్ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే చాలు అది చిరంజీవి పవన్ ల సాన్నిహిత్యం పై ప్రభావితం చూపే అంశంగా మారడంతో అటు పవన్ ఇటు చిరంజీవిలు చాల వ్యూహాత్మకంగా వ్యవహరించవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి.  ఇప్పుడు అటువంటి సందర్భమే మరొకసారి రిపీట్ కాబోతోంది.

కొద్ది రోజుల వరకు భిన్న ధృవాలుగా కొనసాగిన దాసరి చిరంజీవిల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగి పోతున్న నేపధ్యం తెలిసిందే. ‘ఖైదీ’ సూపర్ సక్సస్ తో టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవికి రోజుకు ఒకరు పార్టీ ఇచ్చే పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. మొన్ననే కాంగ్రెస్ ఎంపి టి.సుబ్బిరామిరెడ్డి చిరంజీవిని సత్కరించి ఒక పార్టీ ఇచ్చిన సంగతి తెలసిందే. 

ఇప్పుడు అదే తరహాలో దాసరి నారాయణరావు కూడా ఒక పార్టీని ఇవ్వబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఎప్పటినుండో చిరంజీవి అండ్ దాసరి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తున్న నేపధ్యంలో చిరంజీవి దాసరిను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలిచి అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు దానికి ప్రతిగా దాసరి కూడ చిరంజీవి కోసం ఒక ప్రత్యేకమైన పార్టీ ఇవ్వబోతున్నాడన్న వార్తలు వస్తున్నాయి.

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు దాసరి ఈ పార్టీకి పవన్ ను రప్పించాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ రంగంలోని అనేక మంది ప్రముఖులు పాల్గొనబోతున్న ఈ డిన్నర్ మీట్ కు ఇప్పుడు పవన్ వస్తాడా ? రాడా అన్నది హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పటికే దాసరికి ఒక సినిమాలో నటిస్తానని మాట ఇచ్చి మాట తప్పిన పవన్ దాసరి పిలుపును ఎంత వరకు గౌరవిస్తాడు అన్న ఆసక్తి చాలామందిలో ఉంది. రాబోతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పవన్ వ్యుహాత్మకమైన అడుగులు వేయవలసిన నేపధ్యంలో పవన్ దాసరి పిలుపును తిరస్కరించే సాహసం చేయడని చాలామంది భావిస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: